ష‌ర్మిలకు సీటు ఖరారైందా..?

విజ‌య‌మే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్య‌ర్ధుల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు.. జాతీయ రాజ‌కీయాల్లో కూడా త‌న‌ముద్ర ఉండాల‌ని భావిస్తున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపీ సీట్ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాధ్య‌మైన‌న్ని ఎంపీ స్థానాలు గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప నుంచి త‌న సొద‌రి వైఎస్ ష‌ర్మిల ను రంగంలో దింపాల‌ని బావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఎంపీ అవినాష్ రెడ్డిపై వ్య‌తిరేక‌త లేదు. పైగా యువ‌కుడు.. అదే కుటుంబానికి చెందిన వ్య‌క్తి అయినా తెలుగుదేశం నుంచి వ‌స్తున్న గ‌ట్టి పోటీ నేప‌థ్యంలో ష‌ర్మిల స‌రైన అభ్య‌ర్ధి అనే బావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారట‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న బాబాయి వివేకానంద‌రెడ్డి ఓట‌మి త‌ర్వాత ఛాన్స్ తీసుకోవ‌డం అన‌వ‌స‌రం అన్న బావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. అవినాష్ రెడ్డి గెలవ‌డం గెల‌వ‌క‌పోవ‌డం కంటే… భారీ మెజార్టీ కూడా పార్టీకి కీల‌కం.. ఇవ‌న్నీ లెక్క‌లేసిన జ‌గ‌న్ ష‌ర్మిల వైపు మొగ్గుచూపుతున్న‌ట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా లేదా.. రాజ్య‌స‌భ‌కు పంపే అవ‌కాశాలున్నాయట‌. అటు ష‌ర్మిల కూడా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. మంచి వాగ్ధాటి.. ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న ష‌ర్మిల వ‌స్తే పార్టీకి సీమలో బూస్ట‌ప్ వ‌స్తుంద‌ని కేడ‌ర్ అంటోంది. మ‌రి ష‌ర్మిల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయో?

Recommended For You