విజయవాడ ప్లీనరీ వెనక వ్యూహమిదేనా..?

పార్టీ ప్లీన‌రీ విజయవాడలో నిర్వ‌హించాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. న‌వ్యాంధ్ర రాజ‌ధానిలోనే పార్టీ పండ‌గ జ‌రుపుకోవాల‌న్న నేత‌ల సూచ‌న‌కు అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. జూలై నెల 8,9 తేదీల్లో విజయవాడలో వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీకి 13వేల మందికి ఆహ్వానం పంపుతున్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జాతీయ సమావేశం, రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. తెలంగాణలో అన్ని జిల్లాలకు కలిపి ఒకేసారి హైదరాబాద్‌లో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తారు.

గతంలో పార్టీ ప్లీనరీ ఇడుపులపాయలో నిర్వహించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా ఆ సారి విజయవాడలో నిర్వహించనున్నారు, దీని వెనక బలమైన కారణం ఉంది. జగన్ ఇంకా అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదని.. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచే పార్టీ నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ ఉంటే హైదరాబాద్, బెంగళూరు లేదంటే ఇడుపుల పాయ అంటూ టీడీపీ నేతలు తరచుగా టార్గెట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పార్టీ ప్లీనరీ అమరావతిలో నిర్వహించాలని భావించినా.. అక్కఢ మూడు రోజుల పాటు వసతి, మౌలిక వసతుల సమస్య నేపథ్యంలో విజయవాడలో జరపాలని నిర్ణయించారు. ప్లీనరీతో పాటు.. జగన్ కూడా ఇక నుంచి ఇక్కడే ఉంటారన్న సంకేతాలు బలంగా ఇచ్చేలా నివాసం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ త్వరలోనే తన నివాసం అమరావతికి మార్చనున్నారు.

Recommended For You

Comments are closed.