దేవినేని ఉమ మైలవరంలో గెలుస్తాడా?

ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. నేతలు సర్వేలు చేసిన వారివెంట పడుతున్నారు. తమ అదృష్టం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు సొంతంగా సర్వేలు కూడా చేయించుకున్నారు. అయితే ప్రజానాడి వారికి అంతుచిక్కడ లేదు. కీలక నేతలు పోటీచేసిన నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసిన కొందరు మంత్రులకు ప్రతికూల పరిస్థితులున్నాయని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఇందులో మైలవరం నుంచి బరిలో దిగిన సీనియర్‌ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు వినిపిస్తోంది. కృష్ణా జిల్లా మైలవరం నుంచి బరిలో దిగిన దేవినేనికి  వైసీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంఇ. వసంత కృష్ణ ప్రసాద్‌ గత ఏడాదిగా నియోజకవర్గంలో పాగా వేసి చాపకిందనీరులా పనిచేసుకుపోయారు. ఆర్ధికంగా బలంగా ఉన్న కృష్ణప్రసాద్‌ ఖర్చు విషయంలో …

ఏమాత్రం వెనకాడలేదు. పైగా సామాజికవర్గం కూడా కలిసివచ్చింది. దేవినేనిది, వసంతది ఒకేసామాజిక వర్గం కావడంతో ఇక్కడ ఓట్లు భారీగా చీలినట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వైసీపీకి పట్టుంది. దీంతో సహజంగానే ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వసంతకృష్ణప్రసాద్‌ వర్గం ప్రచారం చేసుకుంటోంది. దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉండడంతో సహజంగానే కొంత వ్యతిరేకత ఉందని. ఇవన్నీ తనకు కలసివస్తాయంటున్నారు. దేవినేని డబ్బు విషయంలో వెనకపడ్డారని.. ఎక్కువగా ఖర్చుచేయకపోవడంతో ప్రతికూలంగా ఉందని టీడీపీలో కూడా కొందరు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు భారీగా ప్రభావం చూపిందని.. కానీ దేవినేని మీడియా మేనేజ్‌ మెంట్‌ లో, మనీ మేనేజ్‌ మెంట్‌ లో విఫలమయ్యరన్న టాక్‌ ఉంది. అయితే ఇవన్నీ దేవినేని వర్గం ఖండిస్తోంది. తన విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. రాజకీయంగా అనుభవం లేని వసంతకృష్ణప్రసాద్‌ విజయం అంతసులభం కాదంటున్నారు. దేవినేని ఉమాకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. పార్టీ బలం.. దీనికి తోడు చంద్రబాబు చరిష్మా కలిసివస్తాయంటున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, వ్యక్తిగత పరిచయాలతో దేవినేనికి పట్టుందని.. కేవలం డబ్బు తీసుకుని కొత్తగా వచ్చినవ్యక్తులకు పట్టం కట్టరని అంటున్నారు. ఎవరు ఏం చెప్పినా.. ఇక్కడ పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగింది. దేవినేని మాత్రం గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. మరి ఆయన విజయం సాధిస్తారా? చూడాలి.

Recommended For You