బంగారం కొంటున్నారా మోస‌పోతారు జాగ్ర‌త్త‌?

 

బంగారం కొంటున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి.. కొన్న బంగారం ఒక‌టికి రెండుసార్లు ప‌రీక్షించండి.. లేదంటే న‌కిలీ ఆభ‌ర‌ణాలు మీకు అంట‌గ‌ట్టే ప్ర‌మాదం ఉంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం గోల్డ్‌ అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌లే అయినా.. బ్లాక్ మ‌నీ కంట్రోల్ చేయ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. ఇష్టారాజ్యంగా ప‌సిడి కొన‌డాన్ని కూడా నియంత్రించింది. దీంతో స‌హ‌జంగానే అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. ఒక‌ప్పుడు లాభాలతో క‌ల‌క‌లలాడిన ఆభ‌ర‌ణాల దుకాణాలు.. ఇప్పుడు విక్ర‌యాలు లేక  వెల‌వెల‌బోతున్నాయి. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు, సిబ్బంది వేత‌నాలు, అద్దెలు వ్యాపారుల‌కు భారంగా మారాయి. దీంతో న‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌డానికి కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఉత్త‌రాదిలో కొన్ని చోట్ల కేసులు న‌మోదు అవుతున్నాయట‌. త‌మ న‌ష్టాల‌ను పూడ్చుకోవ‌డానికి అమ్మే బంగారం క‌ల్తీ చేసి క‌స్ట‌మ‌ర్ల‌కు అంట‌గ‌డుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే వినియోగ‌దారులు గ్యారెంటీ కార్డులు, స‌రైన ఆధారాలు, బిల్లులు లేకుండా బంగారం కొన‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొంటే హాల్‌మార్క్ వివ‌రాలు తీసుకోండి. బిల్లు ప‌క్కాగా చెక్ చేసుకోండి. వీలైతే న‌గ‌ల ఫోటోలు అక్క‌డే తీసుకోండి.  అయితే వ్యాపారులంతా మోసం చేస్తున్నార‌ని కాదు.. కొంద‌రు ఉంటారుగా అందుకే జాగ్ర‌త్త‌లు తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

Recommended For You