ప్రజల మద్దతు లేకుండా ఏ స్వామిజీ మాత్రం ఏం చేస్తారు?

మీరే మా బాధను అర్థం చేసుకుని.. మా శాఖను కాపాడాలి అని చినజీయర్‌ స్వామిని రెవెన్యూ ఉద్యోగులు వేడుకున్నారు. గత కొంతకాలంగా శాఖను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై వారిలో కలవరం మొదలైంది. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు సతీశ్‌ నేతృత్వంలో ప్రతినిధులు చినజీయర్‌ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేసీఆర్ ఆరాధించే ఆధ్మాత్మిక గురువు చినజీయర్ స్వామి అందుకే  ఆయన వద్దకు  వెళ్లి తమ గోడు చెప్పేందుకు ప్రయత్నించారు. దేవుడు  ఆశీర్వాదం ఇవ్వగలరు కానీ.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయలేరుగా.. పాపం.. పైగా ప్రజలు మద్దతు ఉంటే.. ఎవరైనా చెప్పగలరు.. చాలాకాలంగా రెవెన్యూ శాఖ అంటే అందరిలో భయం ఉంది. లంచాలు తినే శాఖ ముద్ర పడింది. పోతే బాగుండే అనే అభిప్రాయం బలంగా నాటుకపోయింది. అందుకే వీరి ఉద్యమానికి జనాల మద్దతు ఆశించిన స్థాయిలో లేదు. కేసీఆర్ నిర్ణయం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖలపై జనాల్లో పేరుకపోయిన చెడు భావన తొలగించడంతో ఈ శాఖలు పూర్తిగా విఫలం అయ్యాయి. దీంతో వారికి పెద్దగా జనబలం లేదు. ఉద్యోగాలు పోవు కాదా.. జీతాలు కూడా వస్తాయిగా ఎందుకు భయపడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 200 ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖ మార్పు మంచికా… చెడుకా పక్కనపెడితే కేసీఆర్ జనాలను సిద్దం చేయగలిగారు.. కానీ రెవెన్యూ ఉద్యోగులు ఉండాల్సిన అవసరం గురించి బలంగా వినిపించలేకపోతున్నారా?

Recommended For You