ఆ పాపమంతా ప్ర‌భుత్వానిదే…!

అవును కింగ్‌ఫిష‌న్ ఎయిర్‌లైన్స్ మునిగిపోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వ‌మేన‌ట‌. ఎవ‌రో చెప్ప‌లేదు, ప్రస్తుతం విల్‌ఫుల్ డిఫాల్ట‌ర్ గా కేసులు ఎదుర్కొంటున్న సంస్థ అధిప‌తి విజ‌మ్ మాల్యా అంటున్న మాట‌లు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా త‌న లిక్క‌ర్ సంస్థ యూబీ గ్రూప్ ఏజీఎమ్‌లో ఆయన మాట్లాడారు. కింగ్‌ఫిష‌ర్ త‌న వ్యాపార జీవితంలో చీక‌టి అధ్యాయమట. అయితే త‌న త‌ప్పు కంటే ప్ర‌భుత్వ విధానాలే సంస్థ నాశ‌నానికి కార‌ణ‌మ‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ఎయిర్‌లైన్స్ సంస్థ‌కు భారీగా ప‌న్నులు విధించాయని.. అప్ప‌ట్లో ఫ్యూయ‌ల్ స‌ర్‌ఛార్జీలు అధికంగా ఉంండేవని అన్నారు. అప్ప‌టికే న‌ష్టాల్లో ఉన్న కంపెనీకి వ‌డ్డీలు కూడా భారంగా మారాయ‌న్నారు. వాస్త‌వానికి త‌న వ్యాపారం మూత ప‌డ్డాక‌.. ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గాయి. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో పన్నుల విధానం స‌వ‌రించారు. దీంతో మిగ‌తా కంపెనీలు లాభ‌ప‌డ్డాయి. అప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న తాము స‌ర్వం కోల్పోయాం అంటూ ఇన్వెస్ట‌ర్ల‌తో అన్నారు. యూబీ గ్రూపునకు వ‌చ్చిన క‌ష్ట‌మేమీ లేద‌ని.. బ్యాంకులు, ప్రభుత్వం సీజ్ చేసే ప్ర‌తిపైసా తిరిగి వ‌స్తుంద‌ని.. కోర్టులో తేల్చుకుంటాన‌ని అన్నారు. కేసుల నేప‌థ్యంలో యూబీ గ్రూప్ ఛైర్మ‌న్‌. ఎండీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన మాల్యా.. ప్ర‌త్యేక అధికారిగా స‌ర్వం ఆయ‌నే చూస్త‌న్నారు.

ఇంత జ‌రిగినా మాల్యా ప్ర‌భుత్వానిదే త‌ప్పు అంటున్నారు. అవునులే అందులోనూ నిజ‌ముంది.. రైతుల‌కు రుణాలు ఇవ్వ‌మంటే స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు అడిగే బ్యాంకులు కేవ‌లం కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అని ప్ర‌క‌టించిన‌ బ్రాండ్ పెట్ట‌గానే ఎలాంటి పూచీక‌త్తు లేకుండా వేల కోట్ల రుణాలు ఇచ్చాయి. సామాన్యుడికి గ్యారెంటీ లేకుండా ముద్ర లోన్ కూడా ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వాలు కూడా ఏమ‌న‌డం లేదు. మ‌రి బ్యాంకుల త‌ప్పు లేద‌ని.. ప్ర‌భుత్వాల పాపం కట్లేటుకోలేదని మ‌నం కూడా అన‌కుండా ఉండ‌గ‌ల‌మా..

Recommended For You

Comments are closed.