నాడు ప్ర‌ణ‌బ్‌ను గౌర‌వించిన కాంగ్రెస్.. నేడు వెంక‌య్యను అవమానించిన బీజేపీ?

సోనియాగాంధీ నాడు కాంగ్రెస్ త‌ర‌పున సీనియ‌ర్ అయిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్టీని ప్ర‌ధాని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌న్మోహ‌న్ సింగ్ ను ప్ర‌ధాని చేశారు. అంతా అనుమానించారు. సీనియార్టీని పక్కపెట్టారని విమర్శించారు. కానీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సీనియ‌ర్టీని సోనియా విస్మ‌రించ‌లేదు.. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర‌ప‌తిని చేసి గౌర‌వించారు. అత్యున్న‌త స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు బీజేపీ మాత్రం వెంక‌య్య‌ను అవ‌మానించింద‌నే అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లోని స‌గ‌టు ఆయ‌న అభిమానుల్లో వ్య‌క్తమ‌వుతోంది. బీజేపీలో ఇప్పుడు కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వారి అంద‌రికంటే సీనియ‌ర్ నాయ‌కుడు వెంక‌య్య. వాజ్ పేయ్‌, అద్వానీ, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి వంటి వాళ్ల త‌ర్వాత స్థానం ఆయనదే. మంత్రిగా స‌మ‌ర్ధుడిగా నిరూపించుకున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌గా దేశ వ్యాప్తంగా ఎక్క‌డ సంక్షోభం ఉన్నా రంగంలో దిగి చ‌క్క‌దిద్దిన నాయ‌కుడు. అంద‌రికీ త‌ల్లో నాలుక‌గా ఉండే పెద్దాయన. అలాంటి వ్య‌క్తికి ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే త‌క్కువ చేయ‌డ‌మే అన్న భావ‌న ఉంది. ఉపరాష్ట్రపతి పదవిని అవమానించడం కాదు.. కానీ ఆయన స్థాయికి తగదన్నది మాత్రమే ఆయన అభిమానుల వాదన. పార్టీ కోసమే ఇంతకాలం సిద్దాంతాల‌ను న‌మ్ముకుని ప‌నిచేసిన వెంక‌య్య‌ స్థాయికి తగ్గది  స‌రికాద‌న్న‌ది బీజేపీలో వినిపిస్తున్న మాట‌. నాడు కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని సంకీర్ణంలో కూడా మిత్ర‌ప‌క్షాల‌ను ఒప్పించి కాంగ్రెస్ రాష్ట్ర‌ప‌తిని చేస్తే.. నేడు బ‌ల‌ముండి కూడా బీజేపీ ట్రుబుల్ షూట‌ర్ వెంకయ్య అర్హుడు కాలేక‌పోయారు.. ఏమైనా గుజ‌రాత్ రాజ‌కీయం క‌దా?

READ ALSO:- వెంకయ్య ఆశీస్సులు తీసుకున్న ఎంపీ కవిత

Recommended For You

Comments are closed.