వంశీ… జగన్ ను కలవడం వెనుక కారణమదేనంట

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ప్రత్యేకంగా ఏపీ సిఎం జగన్నోహనరెడ్డిని కలిశారు. ఆయన ఎందుకు కలిశాడు..ఏంటనేది విపక్ష పార్టీలోనే కాదు..అధికార పార్టీలోను హాట్ టాపికైంది. పార్టీ మారతారా..లేక ఇంకేదైనా కారణముందా అంటూ అంతా ఆరా తీయడం మొదలెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుచరుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారట. కాకపోతే ఆయనకు వచ్చిన సమాచారం..లోపల జరిగిన విషయం వేరుగా ఉందనే వాదన లేకపోలేదు. ఫలితంగా అందరిలోను ఏదో జరగబోతుందనే ఉత్కంఠ నెలకుంది.

ఎన్నికల ముందు… కేసీఆర్ బెదిరింపులను మీడియా ముందుకు తెచ్చి టీఆర్ఎస్ జగన్ బంధాన్ని బయటపెట్టిన నేత వంశీ. ఛాలెంజ్ చేసి మరీ గన్న వరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు రాజకీయాలు.. ఎన్నికలయ్యాక ప్రజలు అన్న సిద్ధాంతంతో ఈరోజు వంశీ జగన్ ను కలిశారట. గన్నవరం ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి జగన్ ను కలవడంతో ఎలాంటి తప్పు లేదు. కానీ వల్లభనేని వంశీ రైతుల సమస్యలపై జగన్ కు కొన్ని వినతులు ఇచ్చారు. ఇప్పటికే వీటిపై వంశీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయినా సరే కలిసి వస్తే మంచిదనుకున్నారట. అందుకే వంశీ కొన్ని విజ్ఞప్తులను జగన్ ముందుంచారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్ సరఫరా చేయాలన్నది అందులో ప్రధానమైనది. తాను సొంత ఖర్చులతో 500 మోటార్లను రైతులకు పెట్టించాను. వాటిని ప్రభుత్వ పరం చేయడానికి తాను సిద్ధమని జగన్ కు వంశీ తెలిపారు. రైతుల కోసం గోదావరి నీటిని పొలాలకు తరలించి పంటలు కాపాడాలని ముఖ్యమంత్రిని కోరారు. రైతుల విషయం కావడంతో జగన్ నో చెప్పలేకపోయారు. వంశీ వినతికి ఓకే చేసినట్లు తెలుస్తోంది.

Also Watch:

Also Watch:

Recommended For You