భార‌తీయుల‌ను హెచ్చ‌రించిన ట్రంఫ్..!

మెరికన్ల‌ ఉద్యోగాలు ఎవ‌రు లాక్కున్నా ఊరుకునేది లేద‌ని అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అమెరిక‌న్ల‌ను తీసేసి.. విదేశీ వ‌ర్కర్స్‌ను హైర్ చేసుకోవ‌డానికి తాను వ్య‌తిరేక‌మ‌ని.. అమెరికన్ల ప్ర‌యోజ‌నాల కోసం ఎలాంటి నిర్ణ‌యం అయినా తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. హెచ్ 1బి వీసాలను ప‌రిమితంగానే ఇస్తామ‌న్నారు. అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చుతాన‌న్నారు. డిస్నీ లాంటి సంస్థ‌లు అమెరిక‌న్ల‌ను తీసేసి.. విదేశీయుల‌కు త‌క్కువ వేత‌నాల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఇక మీద‌ట అలాంటి వాటికి చోటు లేద‌న్నారు. ట్రంఫ్ వ్యాఖ్య‌లు  ఓ ర‌కంగా భారతీయ ఐటీ నిపుణుల‌కు హెచ్చ‌రిక‌లాంటిదే. ఎక్కువ‌మంది ఇక్క‌డ నుంచి హెచ్ 1 బి వీసాల‌పై అమెరికా వెళుతుంటారు. మ‌న కంపెనీల త‌ర‌పున అక్క‌డ ప‌నిచేస్తుంటారు. ట్రంప్ తాజా నిర్ణ‌యంతో భార‌తీయ ఉద్యోగుల‌పై తీవ్రంగా ప్ర‌బావం ప‌డనుంది. మ‌న ఐటీ కంపెనీలు కూడా అమెరిక‌న్ల‌ను హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీసాలు త‌గ్గిస్తే మ‌న‌వాళ్లు స‌ర్దుకుని రావాల్సి ఉంటుంది. దీంతో కంపెనీల‌పై ఆర్ధికంగా భారం ప‌డుతుంది. అయినా త‌మ నిర్ణ‌యం మార‌ద‌ని.. ఎన్నిక‌ల్లో చెప్పిన‌ట్టు వ‌ల‌స‌దారుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ట్రంఫ్ అంటున్నారు.

Recommended For You

Comments are closed.