ప్రగతి నివేదన సభ జనసమీకరణలో నాయకులు విఫలమయ్యారా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ల‌పెట్టిన కొంగ‌ర‌కొలాన్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు పార్టీ ఆశించినంతగా జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. 25ల‌క్ష‌లు అంచ‌నా వేసిన పార్టీ అందుకోలేక‌పోయింది. అతిపెద్ద స‌భ‌గా రికార్డు సృష్టించినా.. పార్టీలో మాత్రం అసంతృప్తి మిగిలే ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నాయి. దీనికి కార‌ణాలు కూడా అంత‌ర్గ‌తంగా విశ్లేషిస్తున్నారు పార్టీ నాయ‌కులు. ముఖ్యంగా గ‌తంలో ఏ స‌భ జ‌రిగినా కూడా హ‌రీష్ రావు కు జ‌న‌స‌మీక‌ర‌ణ అప్ప‌గించేవారు. కానీ ఈసారి బాధ్య‌త‌లు కేటీఆర్‌, మ‌హేంద‌ర్ రెడ్డి తీసుకున్నారు. దీంతో స‌హ‌జంగానే హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల నుంచి పెద్ద ఎత్తున వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. కానీ రంగారెడ్డి, మెద‌క్‌, హైద‌రాబాద్ సిటీల నుంచి పెద్ద‌గా జ‌నం రాలేదు. కేటీఆర్ సిటీ ఎమ్మెల్యేల‌ను, కార్పొరేట‌ర్ల‌ను న‌మ్మారు. కానీ న‌మ్మ‌కాన్ని వారు నిల‌బెట్టుకోలేద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అటు ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ మాత్ర‌మే జ‌నాలు భారీగా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. న‌గ‌రాన్ని అలంక‌రించిన సిటీ నాయ‌కులు జ‌న‌స‌మీక‌ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు. ఇత‌ర మంత్రులు కూడా జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. సిద్దిపేట‌, క‌రీంన‌గ‌ర్ మంత్రులు ఈ సారి జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా త‌గ్గార‌ని చెబుతున్నారు. దీంతో పార్టీలో స‌భ‌పై పోస్ట్ మార్ట‌మ్ అవుతోంది. అయితే అంత‌కుముందు రోజు వ‌ర్షం ప‌డ‌డం.. మేఘాలు క‌మ్ముకుని ఉండ‌డం.. పైగా ట్రాఫిక్ కార‌ణంగా జ‌నాలు కాస్త వెన‌క‌డుగు వేశార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి పార్టీ అధినేత మ‌న‌సులో ఏముందో..

Watch also: ప్రగతి నివేదన సభను పాటలో ఎలా విమర్శించాడో చూడండి..

Watch Also: ఎంత పెద్ద ప్రమాదమో చూడండి..

Recommended For You