ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో అభ్య‌ర్ధుల‌ను అందుకే ప్ర‌క‌టించ‌లేదా?

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ వేదిక‌గా కొంత‌మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని మీడియా స‌మావేశంలో చెప్పిన కేసీఆర్ ఊసే లేకుండా స‌భ‌ను ముగించారు. ప్ర‌క‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణాల‌పై పార్టీలో విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. కేసీఆర్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డానికి ఎమ్మెల్యేల వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌ట‌.. స‌భ‌కు 25 ల‌క్ష‌ల మందిని తీసుకొస్తామ‌ని పార్టీ ప్ర‌క‌టించింది. ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా 25వేల మందిని తీసుకరాలేక‌పోయార‌ని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ లో మ‌రీ దారుణంగా ఏమాత్రం జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. ప్ర‌జ‌ల్లో వారికి స‌రైన సంబంధాలు లేక‌పోవ‌డం.. వారిపై వ్య‌తిరేక‌త కార‌ణంగానే జ‌ప‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేద‌ని భావించిన కేసీఆర్‌.. వారిని న‌మ్ముకుంటే.. ఎన్నిక‌ల్లో కూడా ఓట‌మి త‌ప్ప‌ద‌న్న బావ‌న‌కు అధినేత వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. క‌నీసం 40 మంది సిట్టింగుల‌ను మార్చాల్సిందేన‌ని భావిస్తున్నార‌ట‌. గ్రేట‌ర్ ప‌రిధిలో వ‌ల‌స వ‌చ్చిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు ముగ్గురు త‌ప్ప‌.. మిగిలిన వారిని మార్చ‌డం ఖాయంగా పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ విష‌యంలో 2వ తేదీ మ‌ధ్యాహ్నానానికే ఓ క్లారిటీకి వ‌చ్చిన టిఆర్ఎస్ అధినేత… ఇందులో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టింఏది లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. మ‌ళ్లీ సిట్టింగుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. సిట్టింగుల‌కు ఖ‌చ్చితంగా సీట్లు ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఈ మాట‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కేసీఆర్ అంచ‌నాల‌ను, ఎన్నిక‌ల వ్యూహాల‌ను పూర్తిగా మార్చివేసింది.

Watch Also:

Also Watch:

Recommended For You