తుమ్మలకు గవర్నర్ పదవి ఏమాయా..?

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కథ కంచికి చేరిందా… సారు కారు పదహారుతో కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్‌ కు జనాలు షాకిచ్చారు. అదే సమయంలో టిఆర్ఎస్‌ లో ఒకే ఎన్నిక మగ్గురి ఆశలను తుంచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌ కు పెద్ద షాకు. కేంద్రంలో చక్రం తిప్పడానికి రెండు మూడు ప్లాన్లు సిద్దం చేసుకున్నారు. కానీ అటు జాతీయస్థాయిలో.. ఇటు రాష్ట్రంలో రివర్స్‌ అయ్యాయి. 16 సీట్లు వస్తే.. అక్కడ థర్డ్‌ ఫ్రంట్‌ వస్తుందని భావించారు. కేంద్రంలో కీలక పదవి వస్తుందని నమ్మారు. ఒకవేళ థర్డ్‌ ఫ్రంట్‌ రాకపోయినా.. ఎన్టీయేకు సీట్లు తగ్గితే అందులో చేరి కీలక శాఖలు తీసుకోవచ్చని భావించారు. యూపీఏ వస్తే ఉప ప్రధాని లేదా హోంశాఖ ఇవ్వాలని స్టాలిన్‌ తో చర్చలు కూడా జరిపారు. రాయబారులు, గవర్నర్‌ పదవులు కూడా వస్తాయని ఖమ్మంలో బలంగా చాటారు. తుమ్మల, పొంగులేటికి ఆశలు రేపారు. కానీ ప్రజలు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆశల గల్లంతు చేయడమేకాదు.. కేసీఆర్‌ ను కూడా 9 సీట్లకు పరిమితం చేశారు. దీంతో ఆయన కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు కానీ.. రాష్ట్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీనికి తోడు.. సీఎం అవుతారని బావించిన కేటీఆర్‌ ఆశలు కూడా నీరుగారిపోతున్నాయి. కేసీఆర్‌ జాతీయరాజకీయాల్లోకి వెళితే తాను సీఎంగా పగ్గాలు అందుకుందామని భావించారు. కానీ కేసీఆర్‌ సీఎంగా కొనసాగేందుకే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్‌ లో స్థానం ఆశించారు కవిత. ఒకవేళ తండ్రి కేంద్రంలోకి వెళితే రాష్ట్రంలో కీలక పదవి వస్తుందనుకన్నారు కానీ ఆమె ఎంపీగా కూడా గెలవలేదు. కేసీఆర్‌, కవిత, కేటీఆర్‌ వ్యూహాలు బెడిసికోట్టాయి. దీనికి తోడు.. పార్లమెంట్‌ ఓటమి తర్వాత దూరంగా పెట్టిన అల్లుడు హరీష్‌ రావు ను కూడా మళ్లీ యాక్టీవ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లుడు హరీష్‌ ను దూరంగా ఉంచడం ద్వారా కేటీఆర్‌ ను ఎలివేట్‌ చేద్దామని భావించారు. కానీ పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత హరీష్‌ రావు ను మళ్లీ నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి కేసీఆర్‌ కు అటు పార్టీ పరంగా. ఇటు కుటుంబపరంగానూ రాజకీయంగా ప్రతికూల పరిస్థితులున్నాయి. అయితే కేసీఆర్‌ లాంటి రాజకీయ చాణక్యుడు వీటి నుంచి బయటపడేందుకు ఎంతో సమయం పట్టదు. మరి పరిస్థితులు అనుకూలిస్తాయా?

For more on this news Watch Video

Recommended For You