వారిలో ఉన్న‌ది.. చ‌ర‌ణ్‌కు లేనిది అదేనా?

మెగా హీరోలు చరణ్, అర్జున్, ధరమ్, వరుణ్

మెగా ఫ్యామిలీలో హీరోల మ‌ధ్య  గ‌ట్టి పోటీనే ఉంది. అయితే ఇందులో అస‌లు వార‌సుడు వెన‌క‌ప‌డిపోతుండ‌గా.. కొస‌రు హీరోలు మాత్రం దూసుక‌పోతున్నారు. ఇప్పుడు చిరంజీవి కుటుంబంలో, అభిమానుల్లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. రెండో సినిమాతో వార‌సుడిగా త‌న స‌త్తా చాటుకున్న చ‌ర‌ణ్ ఆత‌ర్వాత స‌రైన హిట్ లేక ఇబ్బందులు ప‌డుతున్నాడు. 50 కోట్ల మార్కును దాట‌డానికి తెగ కష్ట పడుతున్నాడు. బాలీవుడ్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే చ‌రణ్‌ను, అటు చిరంజీవిని క‌ల‌వ‌ర‌పెడుతోంది.
ఇదిలా ఉండ‌గా.. అటు ఇదే కాంపౌండ్‌లో నుంచి వ‌చ్చిన అల్లు అర్జున్ హిట్స్‌తో దూసుక‌పోతున్నాడు. రేసుగుర్రంతో 50 కోట్లు మార్కు దాటాడు. స‌రైనోడు సినిమా రిలీజ్‌కు ముందు టేబుల్ ప్రాఫిట్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్ మొద‌టి సినిమా గంగోత్రి చూసిన వాళ్లు ఎవ‌రూ, ఈ రేంజ్‌కు వ‌స్తాడ‌ని ఊహించ‌లేదు. ఇత‌ను హీరోనా అన్నారు. కానీ సినిమా ప‌ట్ల ఫ్యాష‌న్.. పిచ్చి ప్రేమ అల్లు అర్జున్‌ను రోజురోజుకు మార్చింది. సినిమా, సినిమాకు త‌న‌ను తాను బిల్డ‌ప్ చేసుకుంటూ హీరో అంటే వీడు అనే స్థాయికి వ‌చ్చాడు. అటు సినిమాల్లో ఎంత డెడికేష‌న్ చూపిస్తాడో.. అటు అభిమానుల ప‌ట్ల‌.. సోష‌ల్ లైఫ్‌లో కూడా అంత క‌మిట్మెంట్‌తో ఉన్నాడు. అభిమానులు ప్రేమించ‌డానికి అదే కావాలి. న‌ట‌న‌ ఎంత ఇంపార్టెంటో.. వ్య‌వ‌హార‌శైలి కూడా హీరోల ప‌ట్ల ఆరాధనా భావం పెంచుతుంది. ఇందులో అల్లు అర్జున్ స‌క్స‌స్ అయ్యాడు. సినిమా పిచ్చొడు ఎవరంటే అల్లు అర్జున్ అని అగ్రహీరోలంతా తరచుగా చెబుతుంటారు.
అల్లు అర్జున్ బాటలోనే చిరంజీవి మేనల్లుడు ధ‌ర‌మ్ తేజ్ కూడా న‌డుస్తున్నాడు.. ముందుగా ధ‌రమ్ ను చూసిన వారు న‌వ్వారు. రెండో సినిమాలో ఫ‌ర్వాలేదు అన్నారు. మూడో సినిమాతో న‌ట‌న‌లో డెప్త్ ఉంది. ఫ్యాష‌న్ ఉన్నవాడే అనిపించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద నిర్మాత‌ల దృష్టిలో ప‌డుతున్నాడు. మేన‌మామ పోలిక‌లు ప్ల‌స్ అవుతున్నాయి. పైగా అల్లు అర్జున్ లాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ర‌కం. అభిమానుల‌ను పిచ్చిగా ప్రేమిస్తాడు. అందుకే మెగా అభిమానులే కాదు.. బ‌య‌ట‌వాళ్లు కూడా ఆద‌రిస్తున్నారు. ఇదే పంధాను నాగబాబు తనయుడు వరుణ్ అనుసరిస్తున్నాడు. కథల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ముందుగా నటనలో వేరియేషన్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే అగ్రహీరోల జాబితాలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎటొచ్చి చ‌ర‌ణ్ విష‌యంలోనే ఈ క్లారిటి మిస్ అయింది అంటున్నారు కొందరు. రెండో సినిమాతో భారీ విజ‌యం ఆయనకు మైన‌స్ అయింది. మ‌గ‌ధీర త‌ర్వాత అభిమానులు చరణ్ ను చిరంజీవి రేంజ్‌లో చూడ‌డం మొద‌లుపెట్టారు. దీంతో వారి అంచ‌నాలు అందుకోవ‌డంలో యువహీరో త‌డ‌బ‌డ‌తున్నాడు. అదే స‌మ‌యంలో వ్యాపారాలు, ఇత‌ర వ్యాప‌కాల‌పై కూడా చ‌ర‌ణ్ దృష్టి పెట్టారు. సినిమాను వార‌స‌త్వంగా తీసుకున్నారు గానీ.. ఫ్యాష‌న్‌గా భావించ‌డం లేద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే త్వ‌ర‌గా క‌నెక్ట్ కాలేక‌పోతున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలంటున్నాయి. వాస్త‌వానికి చ‌ర‌ణ్‌తో పోల్చితే ఇత‌ర మెగా కాంపౌండ్ మార్కెట్ త‌క్కువే. కానీ దీనిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం చ‌ర‌ణ్‌పై ఉంది. మ‌రి ఏం చేస్తాడో చూడాలి.

Recommended For You

Comments are closed.