తెలంగాణ‌లో బ‌క్క‌చిక్కుతున్న క‌మ‌ల‌నాథుల ల‌క్ష్యం.!

తెలంగాణ‌లో బీజేపీ నాయ‌కులు ఎత్తులు పార‌డం లేదు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగి గెలిచినా.. త‌దుపరి ల‌క్ష్యం తెలంగాణ‌.. ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తామ‌ని డీంబికాలు పోయిన పార్టీ నాయ‌కుల్లో ఇప్పుడు ఆ ఆశ‌లు క‌నిపించ‌డం లేదు. త్రిపుర‌, అసోం గెలిచాం.. ఇక్క‌డ గెల‌వ‌లేమా? అంటూ చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణలో ఉన్న బ‌లం కాపాడుకుంటే చాల‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. నిజంగా పార్టీ తెలంగాణ‌పై జెండా ఎగ‌రేయాల‌ని భావించి ఉంటే.. ఈ పాటికి పార్టీ బ‌ల‌గాలు రంగంలో దిగాయి. అడ‌పాద‌డ‌పా కేంద్ర నాయ‌కులు స‌మావేశాలో స‌రిపెట్టేవాళ్లు కాదు. ఒక‌ప్పుడు అమిత్ షా వ‌చ్చి ఆప‌రేష‌న్ 90 అన్నారు. కానీ ఇప్పుడు అదే నాయ‌కులు ఆప‌రేష‌న్ 60 అంటున్నారు. ఇది ఎన్నిక‌ల నాటికి మ‌రింత కుచించ‌క‌పోయి కేవ‌లం 10-20 సీట్ల మ‌ధ్య ప‌డిపోతుందోమో. త‌మ‌కు ఓటుబ్యాంకు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పొత్తులు పెట్టుకుని స‌ర్దుకునే అవ‌కాశాలూ లేక‌పోలేదు. దీనికి కార‌ణం తెలంగాణ ప‌ట్ల ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా లేదు.

అస‌లు విష‌యం ఇదేనా?
వాస్త‌వానిక‌ బీజేపీని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. త్రిపుర, అసోం వంటి రాష్ట్రాల్లో ఏడాదిన్న‌ర ముందు నుంచి ఓ వ్యూహంతో జ‌నాల్లోకి వెళ్లారు. అక్క‌డ ప్ర‌జ‌ల్లో పార్టీ మ‌మేకం అయింది. ఆర్ఎస్ఎస్ ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేసింది. అనుకున్న ల‌క్ష్యాన్ని ఛేదించింది. అయితే తెలంగాణ‌లో చేయాల‌నుకుంటే అవ‌కాశాలున్నాయి. విభ‌జ‌న రాజ‌కీయాలు చేయ‌డానికి ఇక్కడ భౌగోళిక ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. స‌క్సెస్ అవుతారా, కాదా అన్న‌ది ప‌క్క‌న‌పెడితే.. వారి ముందున్న స‌వాలు సార్వ‌త్రిక ఎన్నిక‌లు. దేశ వ్యాప్తంగా మోడీ గాలి గ‌తం కంటే త‌గ్గింది. 2014లో వ‌చ్చిన సీట్లు రాక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రం కంటే.. పార్ల‌మెంట్ సీట్ల‌పైనే దృష్టి పెట్టింది. ఒక‌వేళ సీట్లు చాల‌క‌పోతే.. టిఆర్ఎస్ వంటి పార్టీల మ‌ద్ద‌తు తీసుకోవ‌చ్చు. ఎలాగూ కేసీఆర్ తో విబేధాలు లేవు. అందుకే తెలంగాణ‌కు టార్గెట్ చేయ‌డం కంటే.. సాన్నిహిత్యం మేల‌ని బావిస్తున్నారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల నేప‌థ్యంలో ఇక్క‌డ అధికార‌పార్టీపై యుద్ధం ప్ర‌క‌టించి.. దూరం కావ‌డం కంటే స్నేహంగా ఉండ‌డం మేల‌ని నిర్ద‌ర‌ణ‌కు వ‌చ్చింది. అందుకే అమిత్ షా వ‌చ్చినా.. పార్టీ వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టారు. అధికార‌పార్టీని టార్గెట్ చేయ‌లేదు.

Recommended For You