గ్రూపు కంపెనీలను మించిన కేసులు..!

టాటా కంపెనీ అంటే ఓ చరిత్ర ఉంది. కానీ గత కొద్ది రోజులుగా పాత చరిత్ర అంతా మాసిపోయి.. వివాదాల ఘనతగా మారిపోతోంది. భవిష్యత్తు తరాలు టాటాలు అంటే కార్పోరేట్ పంచాయితీలు, కేసులు అని మాట్లాడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కంపెనీకి గుండుసూది నుంచి రేంజ్ రోవర్ కారు దాకా వందల కంపెనీలున్నాయి. అన్నీ టాటా సన్స్ గొడుగు కిందనే ఉన్నాయి.  ఎన్ని కంపెనీలు ఉన్నాయో.. అంత‌కంటే ఎక్కువ కేసులు ఇప్పుడు కోర్టుల్లో న‌మోదు అయ్యాయి. మొత్తం 140 ర‌కాల కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యున‌ల్స్‌లో దాఖ‌లు అయ్యాయ‌ట‌. ఇవ‌న్నీ కూడా బోర్డు రూంలో తేల్చుకోవాల్సిన అంశాలు. కానీ బ‌య‌ట ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో వీధికెక్కి.. ఆద‌ర్శంగా ఉండాల్సిన పెద్ద‌లు పెట్టుకున్న కేసుల లిస్టు. ఢిల్లీ, ముంబ‌యి హైకోర్టుల‌తో పాటు.. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ వ‌ర‌కూ ఈ కేసులు దాఖ‌ల‌య్యాయి. ఇందులో కేవియ‌ట్‌, ప‌రువున‌ష్టం కేసులున్నాయి. సైర‌స్ మిస్త్రీ, ర‌త‌న్‌ టాటా మ‌ధ్య త‌లెత్తిన వివాదాలు కోర్టు బ‌య‌ట ప‌రిష్క‌రించుకుంటే బాగుంటుంద‌ని పెద్ద‌లు సూచించినా వీరు మాత్రం కోర్టుకే వెళ్లారు. టాటా గ్రూపు 80 కేసులు వేయ‌గా.. మిగిలిన కేసులు టాటా గ్రూపుపై మిస్త్రీ, నుస్లీ వాడియా త‌దిత‌రులు దాఖ‌లు చేశారు.

Recommended For You

Comments are closed.