చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు […]

Continue Reading

తండ్రి పాలన ముగిసిన కాడే కొడుకు శ్రీకారం చుడతారా?

ఏపీలో పోటీ టగ్‌ ఆప్‌ వార్‌ లాగా ఉంది. టీడీపీ- వైసీపీ లు ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా 120 -130 సీట్లు అంటున్నారు. ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు హడావిడిచేస్తున్నాయి. శ్రేణులు సైతం సంబరాలకు సిద్దమవుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ కేబినెట్‌ పై ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం ఎక్కడ చేస్తారన్న చర్చ ఆసక్తిగా మారింది. […]

Continue Reading

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లా జగన్‌ కు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. కేబినెట్‌ పదవుల విషయంలో సమస్యలు తప్పవంటున్నారు. జిల్లాలో హెమాహెమీలున్నారు. వారంతా గెలిస్తే మంత్రి పదవి రేసులో ఉంటార. ఎవరికివ్వాలన్నది జగన్‌ […]

Continue Reading

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేయనున్నారట.. గతంలో వై ఎస్ కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రిని అనుసరించనున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ తన […]

Continue Reading

జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా వచ్చాయి. ముఖ్యంగా పార్టీ తరపున విజయవాడ నుంచి పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్( పీవీపీ) పై ఆర్ధికనేరాల కేసులు, ఇక పార్టీలో నాయకురాలిగా ఉన్న లక్ష్మి పార్వతి వ్యక్తిగత విషయాలపై పెద్ద ఎత్తున […]

Continue Reading

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని ఆయన ప్రత్యర్ధులు ఆయుధంగా మలుచుకుని విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో పోటీ నువ్వా  నేనా అన్నట్టు సాగింది. ఎన్నికల నాటికి ఎవరు […]

Continue Reading

వైఎస్ ష‌ర్మిల అక్క‌డి నుంచే పోటీ చేస్తారా?

2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ సత్తా చాటినా… తర్వాత మారిన సమీకరణాల్లో పార్టీ కొంత బలహీన పడింది.. గత ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఎంపీగా సునాయసంగా గెలిచినా.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఇబ్బందుల్లో ఉంది.. అటు సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య  వర్గపోరు కూడా కేడర్ ను అయోమయంలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎంపీ సీటు దక్కించుకోవాలంటే.. సుబ్బారెడ్డి కాకుండా ప్రత్యామ్నాయంపై ద్రుష్టి పెట్టింది పార్టీ.. ఈ నేపథ్యంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ […]

Continue Reading

ష‌ర్మిలకు సీటు ఖరారైందా..?

విజ‌య‌మే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్య‌ర్ధుల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు.. జాతీయ రాజ‌కీయాల్లో కూడా త‌న‌ముద్ర ఉండాల‌ని భావిస్తున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంపీ సీట్ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాధ్య‌మైన‌న్ని ఎంపీ స్థానాలు గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప నుంచి త‌న సొద‌రి వైఎస్ ష‌ర్మిల ను రంగంలో దింపాల‌ని బావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఎంపీ అవినాష్ రెడ్డిపై వ్య‌తిరేక‌త లేదు. పైగా […]

Continue Reading

ఎవ‌రు హీరోలు.. మ‌రెవ‌రు ద్రోహులు..!

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఎవ‌రికి వారు హీరోలుగా మారి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటున్నారు. జ‌నాల ముందు ఛాంపియ‌న్ అనిపించుకోవాల‌నుకుంటున్నాయి. వాటి ల‌క్ష్యం హోదా కాదు.. ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు. విభ‌జ‌న అనివార్యం అని తెలిసినా 2013లో అడ్డుకుంటాం.. బిల్లు ఆపుతాం… ఆరు నూరైనా చ‌ట్టం చేయ‌కుండా.. స‌మైక్య రాష్ట్రాన్ని కాపాడతాం అని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన ఈ నాయ‌కులే ఇప్పుడు మ‌ళ్లీ హోదా సాధిస్తాం.. రాష్ట్రానికి న్యాయం చేస్తాం అంటున్నారు. జేడీ శీలం వంటి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు విభ‌జ‌న […]

Continue Reading