న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఓ ప్రైవేటు చాన‌ల్ లో సురేఖ యాంక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో స‌రేష్ తో ప‌రిచ‌యం అయింది. అప్ప‌టికే టీవీషోల‌కు సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేవారు. సురేశ్ తేజ డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలలో సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దీంతో వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. సురేఖ త‌ర్వాత సినిమాల్లో పాత్ర‌ల‌తో బిజీ అయింది. మంచిన కేర‌క్ట‌ర్ న‌టిగా పేరు తెచ్చుకుంది. అంగ‌రు అగ్ర‌హీరోల‌తో న‌టించింది.

Recommended For You