అందుకే కేటీఆర్‌కు కోపం వ‌చ్చినా స‌హ‌నంతో ఉన్నారు.?

కేటీఆర్‌కు కోపం వ‌చ్చింది. అయినా బ‌య‌ట‌కు క‌న‌ప‌డ‌నీయ‌రు అది ఆయ‌న‌గొప్ప‌త‌నం. మ‌రోసారి రుజువైంది. తాజాగా ట్విట్ట‌ర్‌లో ఓ వ్య‌క్తి మంత్రిగారి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టారు. ఇటీవ‌ల ఢిల్లీలో ఓ ఏసీ బ‌స్ షెల్ట‌ర్ ఏర్పాటు చేశారు. దీనికి విప‌రీతంగా ప్ర‌చారం వచ్చింది. దుబాయిలో కూడా ఇలాంటివి ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో కూడా ఎందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దంటూ ఒకాయ‌న కేటీఆర్‌కు స‌ల‌హా ఇచ్చారు. మున్సిప‌ల్ మంత్రి క‌దా.. మీరే వీటిపై దృష్టి పెట్టండంటూ ట్విట్ట‌ర్‌లో కామెంట్ పెట్టారు. అయితే దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు.. బ్ర‌ద‌ర్‌ మ‌న‌ద‌గ్గ‌ర ఆల్రేడీ ఉన్నాయి గ‌తంలోనే ఏర్పాటు చేశాం అని స‌మాధానం ఇచ్చారు. మ‌ళ్లీ ఆ మ‌నిషి మంత్రిగారిని విసిగించారు.. లేదు లేదు న‌గ‌రంలో ఏసీ బ‌స్ షెల్ట‌ర్స్ లేవు.. ఐటీ కారిడార్‌లో కూడా క‌నిపించ‌లేదంటూ ఆన్ లైన్లో రెట్టించారు. అయినా మంత్రిగారు కోప్ప‌డ‌లేదు… పైగా ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన మూడు బ‌స్టాప్‌ల ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పెట్టి రిప్లై ఇచ్చారు.. అంతే కాదు మ‌రో 8వంద‌ల వ‌ర‌కు కొత్త‌గా ఏసీ బ‌స్టాప్ ల ఏర్పాటుకుప్ర‌ణాళిక‌లు సిద్ద‌మైపోయాయంటూ కేటీఆర్ అన్నారు. తెలుసుకోకుండా విమ‌ర్శ‌లు స‌రికాదు బ్ర‌ద‌ర్ అంటూ స‌ద‌రు వ్య‌క్తికి చుర‌క వేశారు. దీంతో స‌ద‌రు పెద్దాయ‌న సైలెంట్ అయ్యారు. మంత్రిగారిని కూడా ప‌దేప‌దే విసిగిస్తే ఎలా?  మొత్తానికి హైద‌రాబాద్ అన్ని రంగాల్లో ముందే ఉంటుంద‌ని మ‌రోసారి చెప్పిన‌ట్టు అయింది. ఢిల్లీలో దేశంలోనే తొలి ఏసీ బ‌స్ షెల్ట‌ర్ అని అని ప్ర‌చారం చేసేవారికి గుణ‌పాఠం అయింది.

పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి

Recommended For You

Comments are closed.