సోష‌ల్ మీడియా ఎఫెక్ట్‌.. రంగంలో హ‌రీష్ – ఈట‌ల‌..!

ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు ఆశించిన స్థాయిలో జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో పార్టీ నాయ‌క‌త్వం కూడా అసంతృప్తిగా ఉంది. ఈ స‌భ‌లోనే ఎన్నిక‌లపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని భావించిన‌.. సెంటిమెంట్ ప‌రంగా కేసీఆర్ వెన‌క్కు త‌గ్గారు. అయితే ఎన్నిక‌ల శంఖారావం మాత్రం మ‌ళ్లీ హుస్నాబాద్ లోనే మోగించాల‌ని అధినేత కేసీఆర్ నిర్ణ‌యించారు. 2014 ఎన్నిక‌ల్లో శంఖారావం కూడా అక్క‌డేమొద‌లుపెట్టారు. ఇప్పుడు కూడా వేదిక‌గా మార్చుకుంటున్నారు. మొద‌టి స‌భ బ్ర‌హ్మాండంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. జ‌న‌సమీక‌ర‌ణ బాధ్య‌త‌ల‌ను హ‌రీష్ రావుకు అప్ప‌గించారు. ఆయ‌న‌కు తోడుగా ఈటెల రాజేంద‌ర్ కు అప్ప‌గించారు. అయితే వీరికే అప్ప‌గించ‌డానికి కార‌ణంపై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో వీరిద్ద‌రరీ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. ఎక్క‌డా వీరి ప్ర‌బావం క‌నిపించ‌లేదు. పార్టీలో గ‌ట్టి వాయిస్ వినిపించే వారిని ప‌క్క‌న‌పెట్టార‌న్న వాద‌న సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. కేటీఆర్, మ‌హేంద‌ర్ రెడ్డికి అప్ప‌గించ‌డంపై మీడియాలో చ‌ర్చ సాగింది. హ‌రీష్ రావును ప‌క్క‌న‌పెట్ట‌డం వ‌ల్లే స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేద‌ని.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు జ‌నాలు త‌గ్గార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హ‌రీష్ రావుతో పాటు. ఈటెల‌కు ప్ర‌జాఆశీర్వాద స‌భ‌లు నిర్వ‌హించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. తొలి స‌మావేశం 7న జ‌ర‌గ‌నుంది. అయితే వాస్త‌వానికి ఇందులో నిజం లేద‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. హ‌రీష్ రావు ఎక్క‌డ స‌మావేశం జ‌రిగినా ఆయ‌నే ముందుంటార‌ని.. ఈట‌ల‌కు ఆయ‌న సొంత జిల్లా కావ‌డంతోనే కేడ‌ర్ లో మీటింగులు పెట్ట‌మ‌ని ఆదేశించిన‌ట్టు చెబుతున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వంద స‌మావేశాలు పార్టీకి కీల‌కంగా మారిన‌ నేప‌థ్యంలో తొలి స‌భ ఏర్పాట్ల‌ను హ‌రీష్ రావుకు అప్ప‌గించారు కేసీఆర్‌. కేసీఆర్ ఆదేశాలతొ ఆఘమేఘాల మీద ఎర్రవల్లి పాం హౌస్ కు వచ్చిన మంత్రులు జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. మీటింగ్ విశేషాలు ఈ కింద వీడియోలో ఛూడండి..
Watch:

Recommended For You