జగన్‌ కు వరసగా ఎదురుదెబ్బలు..

మాజీ సీఎం చంద్రబాబుపై పగతో రగిలిపోతున్న జగన్‌ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వారిలో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే సబ్‌ కమిటీ వేసి.. విచారణ జరిపిస్తున్నారు. అయితే జగన్‌ చేస్తున్న ప్రయత్నాలకు అనూహ్యంగా కేంద్రం నుంచి ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తలబొప్పి కట్టేలా సమాధానం టీడీపీ కంటే బీజేపీ నుంచి రావడం గమనార్హం. వరసగా రెండు అంశాల్లో వైసీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. పోలవరంలో అవినీతి జరిగిందని.. బల్లగుద్దీ మరీ వాదించారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ఇరిగేషన్‌ మంత్రి అనీల్‌ వరకూ అంతా ఏదో జరిగిందని.. వేలు కోట్లు చంద్రబాబు దొచుకున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే అవినీతి జరగలేదని.. విచారణ అవసరం అంతకన్నా లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. విజయసాయిరెడ్డి ఏదో సాధించాలని చేసిన ప్రయత్నం రివర్స్‌ అయింది. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ. అవినీతి జరగలేదని.. కేంద్రం అంటోంది.. అదే సమయంలో ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో జనాల్లో వైసీపీ తీరుపై నెగిటీవ్‌ చర్చ మొదలైంది. ఇక రెండోది.. పీపీఏల సమీక్ష.. దీనిపై కేంద్రం దాదాపు మందలించినంత పనిచేసింది. పీపీఏ సమీక్ష అంటే దేశంలోనే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని… ఇది మంచిది కాదని.. నేరుగా కేబినెట్‌ కార్యదర్శి లేఖ రాశారు. తర్వాత కేంద్రమంత్రి కూడా మరోసారి హెచ్చరించారు. అలాంటి పనులు చేయవద్దని… ఇది ఆర్ధిక సరళీకరణ విధానాలకు విఘాతమని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబును ఇరికించాలని తాపత్రయ పడ్డ ప్రభుత్వం చివరకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ముఖ్య సలహదారులు అజేయ్‌ కల్లంతో పాటు.. అధికారులు హాడావిడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. పైగా అధికారులు వచ్చి గత ప్రభుత్వాన్ని నిందించడం విమర్శలకు తావిచ్చింది. మొత్తానికి చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలన్న ఆరాటం తప్ప… వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో వైసీపీ తడబడుతోంది.. ఫలితంగానే చంద్రబాబుకు ప్లస్‌ అవుతోంది. ప్రభుత్వం నవ్వులపాలవుతోంది. మరి వరస తప్పులతో జనాల్లో పలచన అవుతుంది ఎవరు?

 

For Veg People:

Recommended For You