వైఎస్ ష‌ర్మిల అక్క‌డి నుంచే పోటీ చేస్తారా?

2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ సత్తా చాటినా… తర్వాత మారిన సమీకరణాల్లో పార్టీ కొంత బలహీన పడింది.. గత ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఎంపీగా సునాయసంగా గెలిచినా.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఇబ్బందుల్లో ఉంది.. అటు సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య  వర్గపోరు కూడా కేడర్ ను అయోమయంలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎంపీ సీటు దక్కించుకోవాలంటే.. సుబ్బారెడ్డి కాకుండా ప్రత్యామ్నాయంపై ద్రుష్టి పెట్టింది పార్టీ.. ఈ నేపథ్యంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఓదార్పు యాత్రను విజయవంతంగా కొనసాగించిన షర్మిల పేరు తెరమీదకు వస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ఆమె పోటీ ఖాయం అంటున్నారు. ఒంగోలు  ఎంపీ స్థానం నుంచి ష‌ర్మిల పోటీ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. బాబాయి సుబ్బారెడ్డి.. అమ్మాయి కోసం సీటు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. అయితే సుబ్బారెడ్డిని అసెంబ్లీకి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. మొత్తానికి చెల్ల‌మ్మ ష‌ర్మిల ఒంగోలు పార్ల‌మెంట్ నుంచి పోటీ ఖాయం అంటున్నారు. దీని వ‌ల్ల రెండు స‌మ‌స్య‌లు పోతాయి.. బ‌ల‌ప‌డుతున్న టీడీపీని గ‌ట్టిగా ఢీకొట్ట‌వ‌చ్చు.. ఇక అవినాష్ రెడ్డికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Watch video:

Recommended For You