అందుకే రోజాపై వేటు ప‌డ‌లేదా?

ఏడాది సస్సెన్ష‌న్ కాలం ముగిసిన త‌ర్వాత తిరిగి అమ‌రావ‌తిలోని తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యే రోజా అడుగుపెట్టారు. ఎన్నో అనుమానాలు, అడుగుపెట్ట‌నిస్తారా? అన్న సందేహాల మ‌ధ్య రెండు రోజులు ఆమె సభలో ఎట్టికేలకు హాజరయ్యారు. అయితే ఇది తాత్క‌లిక‌మే.. 13 త‌ర్వాత స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునే నిర్ణయంపై ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రివిలేజ్ క‌మిటీ ఏడాది పాటు వేటు వేయాల‌ని నివేదిక స‌మ‌ర్పించింది. అయితే స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డానికి తెలుగుదేశం కార‌ణ‌మంటున్నారు. రోజాకు వ్య‌తిరేకంగా తీసుకునే నిర్ణ‌యం త‌మ‌కు ఎక్క‌డ ఇబ్బందులు తీసుక‌వ‌స్తుందో అని టీడీపీ అధినేత భావించిన‌ట్టు తెలుస్తోంది. ఆఫ్ ది రికార్డ్‌లో దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు వినిపిస్తున్నాయి.

రోజాపై ఇప్ప‌టికే ఏడాది వేటు వేయ‌డం వ‌ల్ల ఆమెకు తెగ ప్ర‌చారం వ‌స్తోంది. ప‌బ్లిసిటీ పెరిగి క్రేజ్ మ‌రింత పెరుగుతోంది. రోజురోజుకు పెద్ద నాయకురాలుగా మారుతోంది. ఆమెకు ధీటుగా టీడీపీలో మహిళా నాయకులు లేకపోవడం మైనస్ మారుతోంది. ఇప్పటికే రోజా విసురుతున్న విమర్శలపై ఎదురుదాడి చేయడానికి సరైన తెలుగు మహిళా నాయకులు లేక ఇబ్బంది పడుతోంది. పాజిటీవ్ కావొచ్చు.. నెగిటీవ్ అయినా ఏ నిర్ణయం తీసుకున్నా అది రోజాకే ప్లస్ గా మారుతోంది. ప్రచారం ఆమెకే కలిసివస్తోంది. పైగా కొంత సానుభూతి కూడా వస్తోంది. వాస్త‌వానికి రోజాకు గ‌తంలో ఉన్న పాలోయింగ్ కంటే.. వివాదాల త‌ర్వాత మ‌రింత పెరిగింది. ద‌క్ష‌ణ భార‌తదేశంలో ఫేస్బుక్ లో 10ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్న మహిళా నాయకురాలిగా అవతరించారు. ఇదే ఆమెకు పెరుగుతున్న ఇమేజ్‌కు అద్దం ప‌డుతుంది. తెలిసితెలిసి ఆమెకు మేలు చేయ‌డం ఎందుక‌న్న భావ‌న టీడీపీలో ఉంద‌ట‌. ఇది ఓ కార‌ణం అయితే… అసెంబ్లీలో ఆమెతో పాటే.. అదే స‌మ‌యంలో పాత‌రేస్తా.. ఆంటీ అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బోండాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయ‌కుండా కేవ‌లం రోజాను టార్గెట్ చేస్తే త‌ప్పుడు సంకేతాలు పోతాయన్న భావ‌న‌లో పార్టీ నాయ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఒక‌వేళ ఇవ‌న్నీ పెద్ద స‌మ‌స్య‌లు కాద‌ని వేటు వేసినా మ‌ళ్లీ కోర్టులు, కేసులు ఇవ‌న్నీ ఎందుకు అన్న‌ భావ‌న  కూడా పార్టీలో వ్య‌క్తమ‌యింది. అందుకే రోజా వ్య‌వ‌హారంలో అధికారపార్టీ ఆచితూచి స్పందిస్తోంది. అయితే ఓ వ‌ర్గం మాత్రం ఆమెపై వేటు వేయాల్సిందే అని ప‌ట్టుబ‌డుతోంది. అనిత స‌హా య‌న‌మ‌ల మ‌రికొంద‌రు నాయ‌కులు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. క్ష‌మాప‌ణ చెప్పేది లేద‌ని.. అనిత‌ను తాను అవ‌మానించ‌లేద‌ని రోజా అంటున్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌న్న‌ది చూడాలి. టీడీపీ కఠినంగా ఉంటుందా? తెలివిగా వ్యవహరిస్తుందా చూడాలి.

Recommended For You

Comments are closed.