రోజాకు ఓటమిభయం పట్టుకుందా?

ఆందోళనలో రోజా ఉందా? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజాకు ఓటమిభయం పట్టుకుందా? నిత్యం చంద్రబాబునాయుడిపైనా, టీడీపీ నేతలపైనా జబర్దస్త్‌ ప్రదర్శించే ఈ నటి ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో చావో రేవో అన్నట్టు రోజా పోటీపడ్డారు. గత ఎన్నికల్లో ఆమె గెలిచినా కూడా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. జగన్‌ సీఎం అవుతారంటూ పార్టీ వర్గాలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తమనే విజేతలుగా చూపిస్తున్నాయని జగన్‌ కూడా కేడర్‌ తో అంటున్నారు. ఈ నేపథ్యంలో గెలిస్తే రోజాకు మంత్రి పదవి ఖాయం. కానీ ఇప్పుడు రోజాతో సరికొత్త టెన్షన్‌ ఇదే.. ఆమె గెలుపు కష్టమేనంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బెట్టింగులు సైతం పెద్ద ఎత్తున కాస్తన్నారు. బెట్టింగులు కాసేవారిలో 90శాతం మంది రోజా ఓడిపోతుందని కాస్తున్నారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడు భాను ప్రకాష్‌ కు జనాల్లో ఇమేజ్‌ ఉంది. సెంటిమెంట్‌ తో పాటు.. ఆర్ధికంగా భారీగానే ఖర్చు చేశాడు. గత కొంతకాలంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి మద్దతు కూడగట్టాడు.  తండ్రి వారసత్వం.. మాస్‌ లీడర్‌ గా ఇమేజ్‌ భాను కు ప్లస్‌ అయింది. గత ఎన్నికల్లో కూడా రోజా స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు గెలవడం అంతసులభం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. పార్టీ అధినేత ఇచ్చిన నివేదికలో కూడా ఆమె విజయంపై సందేహాలు వ్యక్తం చేశారట. దీంతో ఆమె కూడా విజయంపై ఆందోళనలో పడ్డారట. సన్నిహితుల వద్ద ఆందోళనగా ఉన్నట్టు చెబుతున్నారు. గెలుస్తామని భరోసా ఉంటే.. ఈ పాటికి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించేవారు. తన విజయిన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశారంటూ ఆరోపణల తుఫాను సృష్టించేవారు. కానీ అలా చేయకపోవడం వెనక ఆమె అపజయం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఆమె పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. పార్టీ కార్యాలయంలోనూ, అటు పార్టీ వేదికలపైనా కనిపించడం లేదు. పైగా తనను మళ్లీ టీడీపీలోకి రావాలంటూ పిలుపు వస్తందని చెప్పడం ద్వారా ఆమె ఇస్తున్న సంకేతం ఏంటి? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు రోజా ఎందుకు మౌనంగా ఉన్నట్టు. రోజాలో గెలవనన్న భయం పెరిగింది? ఆమె ఆందోళన అంతా ఒక్కట.. పార్టీ అధికారంలోకి వచ్చి తాను గెలిస్తే మంత్రిపదవి గ్యారెంటీ… కానీ పార్టీ అధికారంలోకి వచ్చి.. తాను ఓడిపోతే పరిస్థితి ఏంటి? తన రాజకీయ భవిష్యత్త ఏం కావాలి? ఇప్పుడు ఇదే ఆసక్తిగా మారింది?

Recommended For You