రేవంత్ రెడ్డి మళ్లీ పార్టీ మార‌తారా?

రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో బ‌తుకు లేద‌ని భావించిన రేవంత్ రెడ్డి గ‌త ఏడాది చంద్ర‌బాబుతో మాట చెప్పి.. ఆయ‌న సూచ‌న‌ల‌తో కాంగ్రెస్ గూటికి చేరారు. రాహుల్ తో నేరుగా ట‌చ్ లోకి వెళ్లిన ఈ యువనాయ‌కుడు త‌న‌కు హ‌స్తం రేఖ‌లు అధ్బుతంగా ఉంటాయ‌ని బావించారు. కానీ ఇక్క‌డ కాక‌లు తీర‌ని యోధులు.. ఆయ‌న ముంద‌రి కాళ్ల‌కు బంధం వేశారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలని ఆవేశంగా వ‌చ్చిన రేవంతుడికి తెలంగాణ‌లోని పాత‌కాపులు ఎద‌గ‌కుండా అడ్డు చ‌క్రం వేస్తున్నారు. సీఎం రేసులో లేను.. పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇస్తే అధికార పార్టీపై దూకుడు ప్ర‌ద‌ర్శించి జ‌నాల్లోకి వెళ‌తాన‌ని ప‌దేప‌దే చెప్పినా ఆయ‌నకు స‌హ‌కారం అంద‌డం లేదు. కేసీఆర్ ను ఢీకొట్ట‌గ‌ల నాయ‌కుడిగా అధిష్టానం గుర్తించినా.. పీసీసీలో ఉన్న నాయ‌కులు మాత్రం త‌మ ప‌దవుల‌కు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందోన‌ని దూరం పెడుతున్నారు. క‌ర్నాట‌క‌లో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి 2012లో సిద్ద‌రామ‌య్య సీఎం ప‌ద‌వి త‌న్నుక‌పోయిన‌ట్టు త‌మ భ‌విష్య‌త్తుకు రేవంత్ కూడా అడ్డు వ‌స్తాడ‌ని నాయ‌కులు తెర‌లు క‌డుతున్నారు. దీంతో విసిగిపోయిన రేవంత్ రెడ్డి మ‌ళ్లీ పార్టీ మార‌డానికి సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. మ‌ళ్లీ లుగుదేశం పార్టీ గూటికి చేరి.. పార్టీ బ‌లోపేతం చేసుకుంటే.. 10 సీట్లు సంపాదించినా క‌ర్నాట‌క త‌ర‌హాలో కుమార‌స్వామి ఫార్ములాలో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలున్నాయ‌ని రేవంత్ ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే అంత తేలిక కాద‌ని తెలిసినా.. ఓ ప్ర‌య‌త్నం చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న స‌న్నిహితుల‌తో పంచుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ ఉద్దేశం బాగానే ఉన్నా.. ఇక్క‌డ తెలుగుదేశం అన్ని సీట్లు గెలుచుకోవ‌డం సాధ్యం కాద‌న్న భావ‌న ఉంది. దీంతో మ‌రో ఫార్ములా కూడా సిద్దం చేసిన‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో నే ఉండి.. తెలుగుదేశం అధినేత సాయంతో కీల‌క ప‌ద‌వి పొందాల‌ని చూస్తున్నార‌ట‌. మారిన దేశ రాజ‌కీయ స‌మీక‌ర‌ణల్లో టీడీపీ- కాంగ్రెస్ మ‌ధ్య సంబంధాలు మెరుగుప‌డుతున్నాయి. మోడీని ఢీకొట్ట‌డానికి కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికి కూడా సిద్ద‌మ‌న్న సంకేతాలు చంద్ర‌బాబు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కు, రాహుల్ కు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ వ్య‌వ‌హారం కూడా చ‌క్క‌బెడ‌తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. రాహుల్ దృష్టిలో మంచి పేరుంది. ఇక చంద్ర‌బాబు కూడా ప‌రిస్థితులు అన‌కూలించి రిక‌మండ్ చేస్తే.. హ‌స్తంలోన‌నే చ‌క్రం తిప్ప‌డం ఖాయం అంటున్నారు. మ‌రి మొత్తానికి రేవంత్ ప‌క్కా ప్లానుతోనే తెర‌వెన‌క మంత్రాంగం జ‌రుపుతున్నారు. మ‌రి ఆయ‌న రాజ‌కీయ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Recommended For You