బీహార్‌తో మ‌ళ్లీ రిజ‌ర్వేషాలు మొద‌ల‌య్యాయి..!

రిజ‌ర్వేష‌న్లు జ‌బ్బు దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంది. అంత‌టా అదే స్వ‌రం.. ఎక్క‌డ చూసినా నినాదం. కులం పేరుతో కొంద‌రు.. మ‌తం పేరుతో మ‌రికొంద‌రు.. ప్రాంతం పేరుతో ఇంకొందరు రిజ‌ర్వేష‌న్లతో ఆడుకుంటున్నారు. నైపుణ్యంతో పని లేదు. తెలివితేట‌ల‌తో అవ‌స‌రం లేదు. అర్హ‌త‌లు గురించి ఆలోచ‌నే లేదు. కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాలు.. ఓటు ప‌డుతుందా లేదా అన్న‌దే సిద్దాంతంగా మారిపోయింది. పార్టీల్లో విధానంగా చేరిపోయింది. గ‌డిచిన రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు అగ్ర‌వ‌ర్ణాలుగా భావించే అభాగ్యుల‌కు కన్నీరు పెట్టిస్తోంది. ఆగ్ర‌హావేశాల‌కు గురిచేస్తోంది.

ఇప్ప‌టికే నివేదిక‌ల‌తో సిద్ద‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం మ‌తం పేరుతో ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తాజాగా మ‌రోసారి కేసీఆర్ అసెంబ్లీలో అదే మాట చెప్పారు. నిన్న క‌ర్నాట‌క కూడా ప్రాంతం పేరుతో రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ రంగంలో 75శాతం రిజ‌ర్వేష‌న్లు బీసీల‌కు ఇస్తామ‌న్న సిద్ద‌రామ‌య్య ప్ర‌భుత్వం.. ప్ర‌యివేటు రంగంలో వంద‌శాతం స్థానికుల‌కే అంటూ కొత్త చ‌ట్టం చేస్తున్నారు. ఇది మ‌ర‌వ‌క ముందే ఇప్పుడు బీహార్ కేబినెట్ ఇంకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఉన్న‌త‌స్థాయి జ‌డ్జీలు, కిందిస్థాయి అధికారుల భ‌ర్తీలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో ఉన్న‌త‌స్థాయి పోస్టుల్లో ఇలా రిజ‌ర్వేష‌న్లు ఎప్పుడూ అమ‌లు చేయ‌లేదు. కానీ ఉన్న‌ప‌ళంగా రిజ‌ర్వేష‌న్ల అంశంతో ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది. రేపోమాపో ఏపీ ప్ర‌భుత్వం కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామంటోంది.

గ్లోబ‌లైజేష‌న్.. సంస్క‌ర‌ణ‌లు, మేధోసంప‌త్తి అంటూ ప్ర‌పంచం అంతా ప‌రుగులు తీస్తోంది. కానీ మ‌న పాల‌కుల మాత్రం ద‌శాబ్దాల నాడే రద్దు చేయాల్సిన రిజ‌ర్వేష‌న్ల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్నారు. ఇంకా కొత్త‌గా ఏయే వ‌ర్గాల‌కు, మ‌రే మ‌తాల‌కు, కులాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని ఆలోచిస్తున్నారు. యూపీ స‌హా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మానిఫెస్టోల్లో ఎంత‌మందికి రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని ఎన్ని పార్టీలు హామీలు ఇస్తాయో ఆలోచిస్తేనే భ‌యంగా ఉంది. నోట్లు ర‌ద్దు చేసినట్టు రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేసి.. ఆదాయం, ఆర్ధిక వెన‌క‌బాటు ఆధారంగా విద్య‌, వైద్యంలో ఆదుకుంటామ‌ని ఒక్క చ‌ట్టం చేస్తే చాలు. రెండేళ్ల‌లో మొత్తం వ్య‌వ‌స్థ గాడిలో ప‌డుతుంది. అదే జ‌రిగితే ప్ర‌భుత్వం నైపుణ్యాభివృద్ధి కోసం ల‌క్ష‌ల కోట్లు ప్ర‌త్యేకంగా ఖ‌ర్చు చేయాల్సిన‌ అవ‌స‌రం ఉండ‌దు. రిజ‌ర్వేష‌న్లు లేవ‌ని తెలిస్తే చ‌దువుతో పాటే కుల‌మ‌తాల‌కు అతీతంగా నైపుణ్యం, తెలివితేట‌లు వాటంత‌ట అవే వ‌స్తాయి. ఉపాధి వేట‌లో పోటీప‌డతారు. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డ‌తారు. అలా కాకుండా పార్టీలు ఇంకా రిజ‌ర్వేషాలు వేసినంత కాలం సంక్షేమం పేరుతో ఎన్ని ల‌క్ష‌లు కోట్లు ఖ‌ర్చు చేసినా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది.

Recommended For You

Comments are closed.