ప‌వ‌న్ -రేణూల విడాకులకు కార‌ణం అదేనట‌..!

గ‌త కొంత‌కాలంగా రేణుదేశాయ్ ను ప‌వ‌న్ అభిమానులు కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రెండో వివాహం చేసుకుంటున్న ఎంగేజ్ మెంట్ ఫొటోలు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమెను క‌ష్టాలు చుట్టుముట్టాయి. తానేదో ప‌వ‌న్ కు అన్యాయం చేస్తున్న‌ట్టు అభిమానులు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకు మింగుడుప‌డ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ట్రాల్స్ తో ఇబ్బంది ప‌డ్డ రేణూ చివ‌ర‌కు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా క్లోజ్ చేశారు. ఇన్ ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్లో కూడా వ‌ప‌న్ అభిమానుల నుంచి కామెంట్లు త‌ప్ప‌డం లేదు. దీంతో ఆమె త‌న బాధ‌ను వెళ్ల‌గ‌క్కుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప‌వ‌న్ నుంచి తాను డ‌బ్బుల కోసం విడిపోలేద‌ని… అస‌లు కార‌ణాలు ఇవంటూ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. పెళ్లి అయిన 11 ఏళ్ల త‌ర్వాత త‌న భ‌ర్త‌కు మ‌రో మ‌హిళ‌తో సంబంధం ఉంద‌ని.. ఓ బిడ్డ కూడా ఉన్నాడ‌ని తెలిస్తే ఏ భార్య అయినా త‌ట్టుకుంటుందా? అందుకే నిల‌దీస్తే విడాకులు తీసుకుందామ‌న్నారు. అదే చేశాను.. ఇది నేను చేసిన త‌ప్పు అవుతుందా.. ప‌వ‌న్ మ‌హిళా అభిమానులు స‌మ‌ర్ధిస్తారా అంటూ ప్ర‌శ్నించారు. త‌న అఫిషియ‌ల్ యూట్యూబ్ వెబ్ లో ఆమె బాధ‌నంతా వెళ్ల‌గ‌క్కారు. పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గ‌డుపుదామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఇష్టం లేక‌పోయినా ఇలాంటి విష‌యాలు చెప్పాల్సి వ‌స్తుంద‌ని రేణూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రిచిపోయిన గ‌తం.. అభిమానుల‌కు క‌నువిప్పు కోస‌మే గుర్తు చేస్తున్నట్టు చెప్పారు.

Recommended For You