న‌యీం ఉచ్చులో ‘రెడ్డి‘ సామాజిక వ‌ర్గం..!

నయీం కేసులో కీలక మలుపులు
నయీం కేసులో కీలక మలుపులు

గ‌త కొంత‌కాలంగా చాలామంది నాయ‌కుల‌కు, పోలీసు అధికారుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది న‌యీం కేసు. ఎప్పుడు ఏ రూపంలో ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని వ‌ణుకుతున్నారు. వాస్త‌వానికి మిగ‌తా సామాజిక వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులకు ఉచ్చు బిగిస్తున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. నాయ‌కులే కాదు.. అధికారుల్లో కూడా ఈ కులానికి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.. ఇందులో నిజ‌మెంతో కానీ… త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ముందే మీడియాకు చెప్పిన మాజీ డీజీపీది కూడా అదే సామాజిక వ‌ర్గం.

హైద‌రాబాద్‌, రంగారెడ్డి, న‌ల్గొండ జిల్లాల‌కు చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌లు ఇప్పుడు న‌యాం వివాదాల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. న‌ల్ల‌గొండ చెందిన కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి బ్ర‌ద‌ర్స్‌పై టిఆర్ ఎస్ నాయ‌కులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. నయీంతో అక్ర‌మం వ్యాపార బంధం ఉంద‌ని.. త‌మ‌ను చంప‌డానికి కూడా న‌యీంతో క‌లిసి కుట్ర ప‌న్నార‌ని ఎమ్మెల్యే వీరేశం ఆరోపించారు. అంత‌కుముందు టీడీపీకి చెందిన ఉమా మాధ‌వ‌రెడ్డి పేరు కూడా తెర‌ముందుకు వ‌చ్చింది. ఇబ్ర‌హీం ప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ చుట్టుప‌క్కల నయీంతో క‌లిసి భారీ ఎత్తున భూక‌బ్జాల‌కు, సెటిల్‌మెంట్ల‌కు పాల్ప‌డ్డారంటూ కాంగ్రెస్ నేత మ‌ల్ రెడ్డి ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. 
వాస్త‌వానికి నాయ‌కులు, అధికారులపై ఇప్పుడు వ‌స్తున్న‌వి ఆరోప‌ణ‌లు మాత్ర‌మే కావొచ్చు. నిజాలు అయి ఉండొచ్చు. అయితే న‌యీంతో సంబంధం ఉంద‌న్న ఊహాగానామే నేత‌లకు నిద్ర లేకుండా చేస్తోంది. అభాండాలు అంటూ ఆగ్ర‌హోద్ర‌క్తులు అవుతున్నారు. ప్ర‌జ‌ల్లో త‌మ‌పై ఎలాంటి అభిప్రాయం వెలుతుందో అన్న భ‌యం. రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు న‌యీంకు స‌హ‌క‌రించిన మాటే వాస్త‌వమే. అందుకే అది మేమే అని జ‌నాలు ఎక్క‌డ న‌మ్ముతారో అని ఆందోళ‌న చెందుతున్నారు. నిజం లేక‌పోయినా ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు పోతాయ‌ని భావిస్తున్నారు. అందుకే నయీం ఇప్పుడు అధికారుల‌కు, నాయ‌కుల‌కు వెన్నులో వ‌ణుకుపుట్టిస్తున్న ఓ డేంజర్ బ్రాండ్‌ గా మారింది.

Recommended For You

Comments are closed.