సెల‌బ్రిటీల‌కు హీరో ర‌వితేజ ఇచ్చిన వార్నింగ్ ఇదేనా?

ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ కారు ప్ర‌మాదంలో మృతిచెందాడు. అయితే ఈ విషాదం కంటే కూడా ఆయ‌న అంత్య‌క్రియుల‌కు కుటుంబస‌భ్యులు ఎవ‌రు రాక‌పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారి తీసింది. భ‌ర‌త్ వ్య‌వ‌హార‌శైలే అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు దూరం చేసింది. ర‌వితేజ ప‌లుమార్లు వార్నింగ్ ఇచ్చినా మార‌క‌పోవ‌డంతో వ‌దిలేసిన‌ట్టు తెలుస్తోంది. చ‌నిపోయినా రాలేదంటే ఎంత‌గా బాధ‌పెట్టాడో అర్ధ‌మ‌వుతుంది. ఈ ఘ‌ట‌నపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది కేవ‌లం భ‌ర‌త్‌కు మాత్ర‌మే కాదు.. మిగ‌తా వాళ్ల‌కు కూడా పాఠం అంటున్నారు. సెల‌బ్రిటీ కుటుంబాల‌కు ర‌వితేజ మార్గ‌ద‌ర్శ‌నం చేసిన‌ట్టు చెబుతున్నారు. అదుపు త‌ప్పిన కుటుంబ‌స‌భ్యుల‌కు ఎలా ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చ‌క్క‌గా చెప్పారంటున్నారు. ర‌వితేజ తీసుకున్న నిర్ణ‌యంతో కొంద‌రు అయినా మారే ఛాన్సుంది. డ్ర‌గ్స్‌, మ‌ద్యానికి బానిస‌లైన యువ‌త… చ‌స్తే త‌మ‌కు కూడా భ‌ర‌త్ గ‌తే ప‌డుతుంద‌ని.. ఎవ‌రూ లేని అనాథ‌గా స్మ‌శానానికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని గుర్తిస్తారంటున్నారు. ఓ మ‌నిషికి అంద‌రూ ఉండి అనాధ‌గా ఓ జూనియ‌ర్ ఆర్టిస్టు చేత త‌ల కొరివి పెట్టించుకోవ‌డం కంటే దారుణ‌మైన చావు ఉంటుందా? మ‌రి ర‌వితేజ నిజంగానే మంచి ప‌నిచేశార‌ని…మ‌ద్యం మ‌త్తులో జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న యువ‌త‌కు మంచి గుణ‌పాఠం నేర్పాడ‌ని అంటున్నారు. సొంత సోద‌రుడు చ‌నిపోయిన బాధ ఉంటుంది.. కానీ స‌మాజానికి చ‌క్క‌టి సందేశం ఇచ్చాడు.. క‌ష్టం అంటే తెలిసిన మ‌నిషి.. అందుకే దారిత‌ప్పిన త‌న త‌మ్ముడిని కూడా దూరంగా పెట్టాడు.

Recommended For You

Comments are closed.