రాజ‌మౌళికి నిద్ర లేకుండా చేస్తున్న మ‌రో ద‌ర్శ‌కుడు!

బాహుబ‌లి రెండో పార్టు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి కంటిమీద కునుకు లేద‌ట‌. ఏ సినిమా తీసినా విడుద‌లకు ముందు ధైర్యంగా ఉండే జ‌క్క‌న్న బాహుబ‌లి పార్టు 2 విష‌యంలో మాత్రం భ‌య‌ప‌డుతున్నార‌ట‌. దీనికి రెండు మూడు కార‌ణాలున్నాయ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొద‌టిపార్టుకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. మార్కెట్ చేసింది. ఇందులో గ్రాఫిక్స్ అధ్బుతమంటూ ప్ర‌సంశ‌లు ద‌క్కాయి.  రెండో పార్టులో ఏ మాత్రం అంచ‌నాలు త‌గ్గినా జ‌నాల్లో చెడ్డ‌పేరు వ‌స్తుంద‌న్న భ‌యం పెరిగింద‌ట‌. పైగా మొద‌టి పార్టు రిలీజ్‌కు ముందు అంచ‌నాలు భాగా ఉండేది.. విడుద‌ల అయిన త‌ర్వాత కూడా క‌ట్ట‌ప్ప ఎందుకు బాహుబ‌లిని చంపాడంటూ విప‌రీతంగా ప్ర‌చారం తెచ్చింది. కానీ ఈ మ‌ధ్య జ‌నాలు బాహుబ‌లిపై చ‌ర్చించుకోవ‌డ‌మే మానేశారు. రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్లు కూడా పెద్ద‌గా జ‌నాల‌ను ఆక‌ర్షించ‌లేదు. సాదాసీదాగా ఉన్నాయ‌న్న అభిప్రాయం ఉంది. పైగా సినిమా వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్న‌ట్టు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. అంటే సినిమాకు క్రేజ్ త‌గ్గిందా అన్న అనుమానాలు యూనిట్‌లో ఉంద‌ట‌. అందుకే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఏమాత్రం అంచ‌నాలు త‌గ్గినా సినిమాకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన‌ రాజ‌మౌళికి ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు. స‌మ‌యం, డ‌బ్బు వృథా చేయించాడ‌న్న ముద్ర ప‌డుతుందట‌. దీనికి తోడు త‌క్కువ బ‌డ్జెట్‌లో అధ్బుత‌మైన గ్రాఫిక్స్‌, లైవ్‌లీ షాట్స్‌తో తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా జ‌నాలు చూసి ఉన్నారు. అప్ప‌టికే చాలామంది బాహుబ‌లితో లెక్క‌లేశారు.  పార్టు 2 కూడా శాతిక‌ర్ణితో పోల్చి చూసుకుని ఏమాత్రం వారి అంచ‌నాలు త‌ప్పినట్టు అనిపించినా టీవీల్లో చూద్దాంలే అనుకుంటారు. అందుకే శాత‌క‌ర్ణి సినిమా రాక‌ముందు ధైర్యంగా ఉన్న రాజ‌మౌళి ఇప్పుడు కాస్త భ‌య‌ప‌డుతున్న‌ట్టు టాక్‌. ఇందులో నిజ‌మెంతో తెలియాలి.

Recommended For You

Comments are closed.