రాజ‌న్ లోటు మోడీకి ఇప్పుడు తెలుస్తుందా..?

బ్లాక్‌మ‌నీ క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుందామ‌ని మోడీ భావించినా వాటిని అమ‌లు చేసేందుకు స‌రైన స‌హ‌కారం దొర‌క‌డం లేదా..? కిందిస్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు మోడీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయా? అవునంటున్నాయి కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు. ఎలాంటి ప‌రిణామాలకు అయినా సిద్దంగా ఉన్నామ‌ని చెప్పిన అర్బిఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌, ఇత‌ర బ్యాంకింగ్ శ్రేణులు హ్యాండిచ్చార‌ట‌. నిర్ణ‌యానికి ముందు అంతా ఆత్మ‌విశ్వాసం ప్ర‌ద‌ర్శించార‌ట‌. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత చేతులెత్తేసిన‌ట్టు తెలుస్తోంది. స‌మ‌యానికి న‌గ‌దు అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారట‌. ప్రజల్లో అసహానానికి దారి తీస్తోంది. జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో పేదలు భాదితులుగా మారారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార, బ్యాంక్ వ‌ర్గాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అదే ర‌ఘురామ్ రాజ‌న్.

మోడీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్దించిన అధికారులు భ‌విష్య‌త్తు ప‌రిణామాల‌పై అంచ‌నా వేయ‌లేక‌పోయార‌ట‌. ఆర్బిఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ ఉండి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదని అటు బీజేపీ వ‌ర్గాలు.. ఇటు అధికార శ్రేణులు అంటున్నాయి. ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ అన్ని విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో విఫ‌లమ‌య్యార‌ట‌. ఆర్ధిక వ్య‌వ‌హారాల శాఖ అధికారులే ఆర్బిఐ త‌ర‌పున బాధ్య‌త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయం ఉంది. ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు బ్యాంకుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. పైగా అస‌లే నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌జ‌లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చి ఆగ్ర‌హంగా ఉంటే.. మాల్యా వంటి వాళ్ల‌ మొండి బ‌కాయిల‌ను రైట్ ఆఫ్ పేరుతో బ్యాలెన్స్ షీట్ నుంచి తొల‌గిస్తున్నా రిజ‌ర్వ్‌బ్యాంక్ పెద్ద‌లు చూస్తూ ఊరుకున్నారు. నిజంగా ఈ నిర్ణ‌యాన్ని ఆర్బిఐ అడ్డుకుని ఉండాల్సింది. ఈ హ‌డావిడి త‌గ్గిన త‌ర్వాత తీసుకోవాల్సిన నిర్ణ‌యం. కానీ ఊర్జిత్ ప‌టేల్ అలా చేయ‌లేక‌పోయారు.

ర‌ఘురామ్ రాజ‌న్ ఎప్పుడూ పేద‌ల గురించి ఆలోచించేవాడు. దేశంలో మెజార్టీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌ ప్ర‌జ‌లకు అనుకూల ప‌థ‌కాలు ఉండాల‌ని బ‌లంగా కోరుకున్న ఆర్ధిక‌వేత్త‌. ఆయ‌న హ‌యంలోనే తాజా నిర్ణ‌యానికి పునాదులు ప‌డ్డా.. ఆత‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాల్లో ర‌ఘురామ్ రాజ‌న్ బాగ‌స్వామ్యం లేక‌పోవ‌డంతో ప‌రిస్థితి ఇలా ఉంద‌ని అంటున్నారు. మోడీ కూడా ఆర్జిత్ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌టేల్ చేయాల్సిన‌ ప‌నిని ఇప్పుడు ఆర్ధిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి శక్తికాంత‌దాస్ చేస్తున్నారు. అనుభ‌వానికి.. రిక‌మండేష‌న్‌కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని పాల‌కులు గుర్తించాలట‌. మంచి ఆర్ధిక వేత్త‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందిన పేద‌ల ప‌క్ష‌పాతిని కాల‌ద‌న్నుకుని.. గుజ‌రాత్ వ్యాపార‌వేత్త‌ల‌ చేతుల్లో పెరిగిన వారిని పీఠంపై కూర్చోబెడితే ఏం జ‌రుగుతుందో ఇప్ప‌టికైనా గుర్తించాల‌ని బీజేపీలో ఓ వ‌ర్గం బాహ‌టంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంద‌ట‌. ఏమైనా ర‌ఘురామ్ రాజ‌న్‌ను రెండోసారి గ‌వ‌ర్ప‌ర్‌గా చేయ‌క‌పోవ‌డం పెద్ద త‌ప్పిదమేన‌న్న భావ‌న క్ర‌మంగా పెరుగుతోంది.

Recommended For You

Comments are closed.