మంత్రి పదవి లేన‌ట్టేనా… విప్ తో పువ్వాడ స‌రిపెట్టుకుంటారా!

ఖ‌మ్మం జిల్లాలో తుమ్మ‌ల ఓట‌మితో పువ్వాడ అజ‌య్ కుమార్ కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కేటీఆర్ తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు, సామాజికవ‌ర్గం, కుటుంబ‌నేప‌థ్యం అన్నీ త‌న‌కు సానుకూలంగా ఉన్నాయ‌ని.. మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ధీమాలో పువ్వాడ కూడా ఉన్నారు. కానీ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇప్ప‌ట్లో మంత్రి ప‌ద‌వి అనుమాన‌మేనంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. తుమ్మ‌ల గెలిచి ఉంటే ప‌రిస్థితి మ‌రొలా ఉండేది.. ఆయ‌న ఓట‌మితో రాజ‌కీయాలు త‌ల‌కిందుల‌య్యాయి. ప్ర‌స్తుతం తుమ్మ‌ల‌ను మంత్రివ‌ర్గంలో తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌న్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చారు. ఓడిపోయిన వారికి ప‌ద‌వి ఇస్తే గెలిచిన వారు బాధ‌ప‌డ‌తారంటూ కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పువ్వాడ ఆశ‌లు పెట్టుకున్నా.. నిరాశ త‌ప్ప‌ద‌న్న అబిప్రాయముంది. కేవ‌లం కొద్దిమందితోనే మంత్రివ‌ర్గం నింపుతార‌ని తెలుస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కూ కేవ‌లం ఐదారుగురు మాత్ర‌మే కేబినెట్ లో ఉంటార‌ని చెబుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప‌లితాలు అనుకూలంగా వ‌స్తే కేటీఆర్ సీఎం కావ‌డం ఖాయం. అప్పుడు పూర్తిస్థాయిలో మంత్రివ‌ర్గం ఉంటుంది. అప్ప‌డే పువ్వాడ‌కు కూడా ఛాన్స్ అంటున్నారు. ఒక‌వేళ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని భావిస్తే డిప్యూటీ స్పీకర్ తో స‌రిపెట్టే అవ‌కాశం ఉంది. ఇది అజ‌య్ కు ఇస్తార‌ని.. అయితే ఇదే ఖ‌రారు చేస్తే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే విస్త‌ర‌ణ స‌మ‌యంలోనే క‌ట్ట‌బెడ‌తార‌ని తెలుస్తోంది. అయితే పువ్వాడ అజ‌య్ మాత్రం మంత్రిప‌దవిపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. డిప్యూటీ స్పీక‌ర్ ఇస్తే తీసుకుంటారా లేదా అన్న‌ది చూడాలి. టీడీపీ నుంచి వ‌స్తున్న సండ్ర‌కు మంత్రిప‌ద‌వి ఇస్తే… పువ్వాడ‌కు ఇచ్చే అవ‌కాశాలు లేవు. మ‌రోరూపంలో న్యాయం చేస్తామ‌ని చెబుతున్న కేసీఆర్ మ‌న‌సులో డిప్యూటీ స్పీక‌ర్ లేదంటే చీఫ్ విప్ ప‌ద‌వి ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Watch Video:

Also Watch:

Recommended For You