లవర్ కూడా ఉంది.. కానీ సైకో లవర్ అరాచకాలు తెలియదట..!

హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డి లీలలు ఒక్కక్కటిగా బయటపడుతోంది. అమాయక బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన ఈ నిందుతుడికి  ప్రేమకథ కూడా ఉందట.  వేములవాడలో ఉండే యువతితో పరిచయం ప్రేమంగా మారిందట. వీరిద్దరూ తరచుగా కలుసుకోవడంతో పాటు.. ట్రిప్ లు కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు  తన నేర చరిత్ర గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. తన సామాజిక వర్గమే కావడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఇంతలో మనోడి చరిత్ర బయటపడింది. కిరాతకుడు అని లోకానికి తెలిసింది. దీంతో   ఇంతకాలం శ్రీనివాసరెడ్డిని ప్రేమించిన యువతి భయంతో వణికిపోతుందట. తన ప్రేమికుడు ఇంత నీచుడా.. వీడినా ప్రేమించింది అని వణికిపోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు…

WatchVideo:

శ్రీనివాసరెడ్డికి ఇంకా చాలా ప్రేమ కథలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫేస్ బుక్ లో వందల మంది అమ్మాయిలు ఉన్నారట. మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా స్నేహితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారందరినీ కూడా ఆరా తీస్తున్నారు. మరి ఇంకెన్ని ఘొరాలు వినాల్సి వస్తుందో చూడాలి.

Also Watch Cooking Videos:

Recommended For You