మ‌రో చ‌రిత్ర‌కు అడుగు దూరంలో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. అంతే కాదు.. వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్ట‌నున్నారు. ఇలాంటి ప్ర‌యోగం తొలిసారి చేస్తున్నారు. పీఎస్‌ఎల్వీ సీ35 లాంచ‌ర్‌ను మ‌న  శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్ర‌యోగించ‌నున్నారు. పీఎస్‌ఎల్వీ-సి35 ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని ధ్రువ‌క‌క్ష్యలో వీటిని ప్రవేశపెడతారు. స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన‌ట్టే.

Recommended For You

Comments are closed.