పోలీస్ చుట్టూ తిరుగుతున్న బాహుబ‌లి

అవును ఇప్పుడు ప్ర‌భాస్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఎలాంటి కేసులు ఆయ‌న‌పై లేవులేండి.. కేవ‌లం పాత్రకోసం. త్వ‌ర‌లో ఈ యంగ్ రెబ‌ల్‌స్టార్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా క‌థ ఎదురుచూస్తోంది. ఇందులో స్టైలిష్‌గా ఉండే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికోసం భారీ క‌స‌రత్తు చేస్తున్నాడ‌ట‌. ఇందులో భాగంగా పోలీసు అధికారుల‌తో ట‌చ్‌లో ఉండి.. ఎలా వ్య‌వ‌హ‌రించాలి. విధుల్లో ఉన్న‌ప్పుడు ఎలా ఉంటారు వంటి అంశాల‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇంత క‌స‌ర‌త్తు ఎందుకు అనుకుంటున్నారా.. ఇప్పుడు బాహుబ‌లి రేంజ్ పెరిగింది. అవును ఆయ‌న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో క్రేజ్ సంపాదించారు. దీనిని నిల‌బెట్టుకోవ‌డానికి భారీ చిత్రాలే చేయాల‌ని బావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా తీసే సినిమాను కూడా త్రిభాషా చిత్రంగా వంద కోట్ల‌తో తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యించారు. అందుకే ఇంత క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. ప‌నిలో ప‌నిగా ఇటీవ‌ల ట్రైల‌ర్ గా ఓ ముఖ్య‌మైన అతిధి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తారంటూ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. సూర్య న‌టించిన సింగ‌మ్ సీరిస్‌లో 3లో ఇది ఉంద‌ట‌. ఇంద‌లో నిజ‌మెంతో?

Recommended For You

Comments are closed.