ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారు..!

బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన ప్ర‌భాస్ బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌భాస్‌ను ఒప్పించ‌డానికి క్యూ క‌డుతున్నారు. ప్ర‌భాస్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామ‌ని చాలామంది నిర్మాత‌లు, సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భాస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్ చిత్ర సాహోలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ మంచి క‌థ ప్ర‌భాస్‌కు కుదిరిన‌ట్టు బాలీవుడ్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ద‌ర్శ‌క నిర్మాత సాజిత్ న‌దియాద్‌వాలా ప్ర‌భాస్‌తో భారీ బ‌డ్జెట్‌కు ప్లాన్ చేశార‌ట‌. ఇప్ప‌టికే క‌థపై రెండు మూడు సిట్టింగులు అయిన‌ట్టు తెలుస్తోంది. సాహో పూర్తి కాగానే దీనిపై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఉన్న పెద్ద నిర్మాత‌ల్లో ఒక‌రైన సాజిత్ సూప‌ర్‌హిట్ చిత్రాలు నిర్మించారు. 2 స్టేట్స్‌, హైవే, కిక్, హౌస్‌ఫుల్ సీరిస్ సినిమాలు చేశారు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో కూడా సినిమా చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు బాలీవుడ్ టాక్‌.. మ‌రి ప‌ట్టాలు ఎక్కుతుందా?

Recommended For You

Comments are closed.