చిత్త‌శుద్ది లేని రాజీనామాలు…

నిజాయితీని నిరూపించుకోవ‌డానికి.. ప‌ద‌వుల కంటే ప్ర‌జాసేవే ప్రాధాన్య‌త అని తెలియ‌జేయ‌డానికి నాయ‌కులు ఒక‌ప్పుడు రాజీనామాలు చేసేవారు. అంత‌టి ప్రాముఖ్య‌త ఉంది. కానీ ఇప్పుడు రాజీనామా అనే ప‌దానికి అర్ధం మార్చేస్తున్నారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా రాజీనామా చేస్తామంటూ స‌వాళ్లు విస‌ర‌డం నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. అలాగ‌ని మాట‌మీద నిల‌బ‌డ‌తారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఈ మాట ఓ ఫ్యాష‌న్‌. ప్ర‌త్య‌ర్థి విమ‌ర్శించినా రాజీనామాకు సిద్దమా అని స‌వాల్‌.. లేదంటే నాయ‌కుల వార‌సులు ఎవ‌రైనా పోటీ చేస్తామంటూ నియోజ‌క‌వ‌ర్గం వ‌దులుకుంటామ‌ని ముందుకు వ‌చ్చే నేత‌లు. ఇలా ప‌ద‌వి అంటే వారికి వారు సృష్టించుకున్నదిగా మారిపోయింది. వాస్త‌వానికి ప్ర‌జ‌లు 5ఏళ్ల‌కు తీర్పు ఇచ్చారు. ప్రజాతీర్పును తుంగ‌లో తొక్కుతూ ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. రాజీనామా చేయాలంటే ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు నిర‌స‌న‌గా చేయ‌వ‌చ్చు. లేదంటే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఉంటే ముందుకు రావ‌చ్చు. కానీ అవ‌స‌రం ఉన్నా లేకున్నా రాజీనామా అంటూ మ‌చ్చ తెస్తున్నారు.పోనీ రాజీనామా చేస్తారా అంటూ అదీ లేదు. ఇవ్వాల్సిన స్పీక‌ర్‌కు త‌ప్ప అంద‌రికీ ఇస్తారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన ఇద్ద‌రు నాయ‌కులు రాజీనామాల వ్య‌వ‌హారం ఇదే చెబుతోంది.. డీకే అరుణ సిఎంకు లేఖ పంప‌గా.. క‌ల్వ‌కుర్తి డివిజ‌న్ చేయాల‌ని అవ‌స‌ర‌మైతే రాజీనామా చేస్తా అంటూ వంశీచంద్‌రెడ్డి స‌వాల్ విసిరారు. వాస్త‌వానికి గ‌ద్వాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. కాద‌న‌డం లేదు. కానీ ఇంత‌కాలం రాజీనామా ఊసెత్త‌ని డీకే అరుణ ఇప్పుడే ఎందుకు స‌వాల్ చేస్తున్నారు. ముసాయిదా ప్ర‌క‌టించ‌న‌రోజే రాజీనామా చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసినా ప్ర‌యోజ‌నం ఉంటుందా.. ఒకవేళ ఆమె రాజీనామా చేయాల‌నుకుంటే స్పీక‌ర్‌కు ఇచ్చి జ‌నాల్లోకి వెళ్ల‌వ‌చ్చు క‌దా? ప‌్ర‌జాతీర్పు కోరుకోవ‌డానికి చిత్త‌శుద్దితో సింగిల్ ఎజెండాతో స్పీక‌ర్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. అలా కాకుండా సిఎంకు పంపించి.. త‌న రాజీనామా స్పీక‌ర్‌కు ఇవ్వాలంటూ చెప్ప‌డం ద్వారా శంకించాల్సి వ‌స్తుంది. వాస్త‌వానికి ఆమె అధికార పార్టీ నాయ‌కురాలు కాదు.. కేసీఆర్‌కు రాజీనామా ఇవ్వ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. పీసీసీ అధ్య‌క్షుడో, సిఎల్పీ నాయ‌కులు జానారెడ్డికో ఇచ్చి ఆమోదింప‌జేసుకుంటే ఆమె స‌వాల్‌కు గౌర‌వం పెరిగేది.
వంశీచంద్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధం అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. లీడ‌ర్ ఎప్పుడూ మాట‌ల్లో కాదు.. చేత‌ల్లో చూపితే జ‌నాల్లో విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుంది. లేదంటూ ప్ర‌జాగ్ర‌హం చ‌విచూడాల్సి వ‌స్తుంది. ద‌శాబ్ధాల క్రితం నాయ‌కుల గురించి ఇంకా మ‌నం చెప్పుకుంటున్నాం. అంటే వారికి ఉన్న చిత్త‌శుద్ది రాజ‌కీయాల ప‌ట్ల గౌర‌వం. కానీ ఇప్ప‌టి నాయ‌కుల‌కు అవేమీ లేవు. వారి అవ‌స‌రానికి రాజ‌కీయాలు చేస్తారు. లేదంటే అధికారం కోసం జెండాలు, ఎజెండాలు మార్చేస్తారు. అప్ప‌డ‌డ‌ప్పుడు ఇలాంటి స‌మ‌యంలో స్వ‌రం వినిపించి మేమున్నామ‌ని చెబుతారు.

Recommended For You

12 Comments

  1. It’s a pity you don’t have a donate button! I’d definitely donate to this fantastic blog! I guess for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to brand new updates and will share this blog with my Facebook group. Chat soon!

  2. I loved as much as you’ll receive carried out right here. The sketch is tasteful, your authored material stylish. nonetheless, you command get got an impatience over that you wish be delivering the following. unwell unquestionably come more formerly again as exactly the same nearly a lot often inside case you shield this increase.

  3. Excellent read, I just passed this onto a friend who was doing some research on that. And he just bought me lunch since I found it for him smile Therefore let me rephrase that: Thank you for lunch! “Love is made in heaven and consummated on earth.” by John Lyly.

  4. Does your blog have a contact page? I’m having problems locating it but, I’d like to send you an email. I’ve got some ideas for your blog you might be interested in hearing. Either way, great site and I look forward to seeing it grow over time.

Leave a Reply

Your email address will not be published.