పవ‘నిజం‘ తెలుసుకోవాలి

పవన్ కళ్యాణ్ పుస్తకం మారుస్తుందా?
పవన్ కళ్యాణ్ పుస్తకం మారుస్తుందా?


గ‌
తంలో ఇజం పేరుతో త‌న వేద‌న‌.. ఆవేద‌న‌.. న‌మ్మిన సిద్దాంతం.. మ‌న‌సులో ఆశ‌యం చెప్పిన ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు పార్టీ కోసం కొత్త పుస్త‌కం రాస్తున్నారు. నేను జనం మనం పేరుతో  తన విధానాన్ని భవిష్యత్తును వివరించాలనుకుంటున్నారు. ఇజం కూడా అదే కానీ అంద‌రికీ అర్ధం కాలేదు. ఇజంలొ ఆయ‌న ఆవేశం ఉంది కానీ పార్టీకి అవ‌స‌ర‌మైన పునాదులు అందులో క‌నిపించ‌లేదు. ఆవేద‌న ఉంది కానీ తాను ఏం చేయాల‌నుకున్నాడో చెప్ప‌లేదు. ఉదాత్తమైన ఆశయం  ఉంది కానీ.. లక్ష్యం  ఎలా చేరుకుంటాడో వివరించలేదు. జ‌న‌సేన పెట్ట‌డానికి ముందు త‌న ఆవేశాన్ని పుస్త‌కంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పార్టీ పెట్టిన త‌ర్వాత త‌న లక్ష్యాన్ని అర్ధ‌మ‌య్యేలా చెబుతానంటున్నాడు. సామాన్యుల‌కు అర్ధ‌మ‌య్యేలా వివ‌రిస్తానంటున్నాడు. పుస్త‌కాల మీద ప్రేమ ఉంది.. అప‌రిమితంగా పుస్త‌కాలుచ‌దివాడు. అందుకే వాటి ప‌ట్ల మ‌మ‌కారం. అందుకే త‌న ల‌క్ష్యాలను కూడా అక్ష‌రాల రూపంలో పొందుప‌రుస్తాన‌ని చెబుతున్నారు. పుస్త‌కానికి ట్యాగ్ లైన్ పెట్టిన‌ట్టు ఇది నిజంగా రాజ‌కీయ యుద్ద‌మా?

ఆయ‌న ఆలోచ‌న నిజ‌మే కావొచ్చు. కానీ ఎన్ని పుస్త‌కాలు రాసినా ప్ర‌సంగాల‌కు సాటిరావు. ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాటా జ‌నం వింటారు. అర్ధం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ అక్ష‌రంగా పెడితే అది అంద‌రికీ చేరువ కాదు. త‌ర‌చుగా ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ విమ‌ర్శించిన‌ట్టు ఆయ‌న అభిమానుల్లో అక్ష‌ర జ్ఞానం లేని వాళ్ల‌కు ఆశ‌యం చేరుతుందా? అట్టుడుగున ఉన్న వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర చేస్తుందా? ఇంకా చ‌దువు మాట ఎర‌గ‌ని గిరిజ‌న గ్రామాల‌కు ప‌వ‌నిజం అంటే అర్ధ‌మ‌వుతుందా? 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌లుపెట్టిన రాజ‌కీయ యుద్ధం గెలవాలంటే ఆయన అక్ష‌ర యుద్ధమే కాదు.. అంతకంటే ఎక్కువ ప్ర‌త్య‌క్ష స‌మ‌రం సాగించాలి. జ‌నాల్లోకి వెళ్లాలి..  పార్టీలు చేసిన మోసాన్ని నిల‌దీయాలి. జ‌న‌సేనానుల‌ను ముందుండి న‌డిపించాలి. ఒక‌రిద్ద‌రు అభిమానులు ప్రాణాలు పోయాయ‌ని ఆగిపోతే అస్త్రాలు మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన‌ట్టు ప్ర‌త్య‌ర్ధులు బాణాలు విసురుతారు. రాజ‌కీయంగా త‌న విధానాల‌ను సిద్దాంతాల‌ను చెప్పుకోవ‌డానికి పుస్త‌కాలు రాయ‌డంలో త‌ప్పులేదు కానీ.. స‌భ‌లు వ‌దిలేసి అక్ష‌రాల‌తోనే ఆశ‌యం సాధిస్తామ‌నే సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. స‌మాన‌త్వం, స‌మ‌న్యాయం అంటూ ఎన్ని పుస్త‌కాలు రాలేదు. ఎంద‌రు సాహితీవేత్త‌లు నిన‌దించ‌లేదు. అయినా ఎందరు జనానికి చేరువ అయ్యాయి. ఓ రాజకీయ నాయకుడు తన ప్రసంగాలతో మాత్రమే జనాన్ని ప్రభావితం చేయగలడు. తన ఆశయాలకు అననుగుణంగా జనం చేత ఓటు వేయించగలడు. మరి పవన్ జనసేన పార్టీని పుస్తకాలతో నడిపిస్తనంటే కదురుతుందా? ప్రసంగాలు లేకపోతే జనం స్పందిస్తారా? ఆయన రాసే పుస్తకం ఎంతమంది కొంటారు.. చదవుతారు.
.

Recommended For You

Comments are closed.