హెమాహెమీలు క‌న్నేసిన నియోజ‌క‌వ‌ర్గం..!

ప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు.. ఉప ఎన్నిక జ‌రిగి ఎంతో కాలం కాలేదు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. అయినా ఇప్ప‌డా నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. అంద‌రినీ ఊరిస్తుంది. జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందిన నాయ‌కులు కూడా అక్క‌డే పాగా వేయ‌డానికి ఉవ్విళ్లూరుతున్నారు. అది ఎక్క‌డో లేదు.. ఖ‌మ్మం జిల్లాలోనే ఉంది. ముఖ్య‌మంత్రి త‌ర్వాత అన‌ధికారికంగా నెంబ‌ర్ 2 స్థాయిలో ఉన్న ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలానే స‌మ‌యం ఉన్నా.. నాయ‌కులంతా ఇప్ప‌టినుంచే అక్క‌డ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. వ్యూహాల‌ను ప‌దును పెడుతున్నారు. పైగా ఇక్క‌డ పోటీ చేయాల‌నుకుంటున్న వాళ్లు కూడా చోటా నాయ‌కులు కాదు.. ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పిన వాళ్లే. ఆయా పార్టీల్లో కీల‌క ప‌ద‌వులు అన‌నుభ‌వించిన వారే.

ఇప్ప‌టికే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలేరు త‌న సొంత‌నియోజ‌పక‌వ‌ర్గ‌మ‌ని ప్ర‌క‌టించారు. క‌నీసం ఖ‌మ్మం ప‌ట్ట‌ణం కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. తుమ్మ‌ల ఏ స్థాయి నాయ‌కుడో కొత్త‌గా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్పుడు తుమ్మ‌ల‌కు నేనే చెక్ ప‌డతానంటూ రేసులోకి వ‌స్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌద‌రి. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఖ‌మ్మం వ‌ర్గ‌పోరు పంచాయితీలో పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఎంపీగా పోటీ చేసేది లేదని.. మిగ‌తా నియోజ‌కవ‌ర్గాల‌తో సంబంధం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. నాకంటే ధీటైన నాయ‌కులు ఎవ‌రైనా ఉంటే చెప్పండి పాలేరు వ‌దులుకుంటా అని రేణుకా మొహ‌మాటం లేకుండా చెప్పార‌ట‌. దీంతో ఆమె పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైన‌యిన‌ట్టే. ఇక టీడీపీ నుంచి పార్టీ మాజీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, మాజీ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు నామా నాగేశ్వ‌ర‌రావు పోటీ చేయ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. గ‌తంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గం కేటాయింపు విషయంలో తుమ్మ‌ల‌తో విబేధాలు వ‌చ్చాయి. పార్టీ వీడిపోయి ఇక్క‌డ నుంచి టిఆర్ఎస్ నుంచి తుమ్మ‌ల గెలిచి స‌త్తా చాటుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ తరపున తానే పోటీ చేసి తుమ్మ‌ల‌పై గెల‌వాల‌ని నామా ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. తాను గెల‌వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు తుమ్మ‌ల‌ను ఓడించి రాజ‌కీయంగా పైచేయి సాధించాల‌ని నామా ఆలోచ‌న‌గా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక వామపక్షాల నుంచి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. పోటీ ప‌డుతున్న నలుగురు కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం విశేషం.

ఖ‌మ్మం జిల్లాలో స‌త్తుప‌ల్లి, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీ రిజ‌ర్వుడు, వైరా ఎస్టీ రిజ‌ర్వుడు, ఖ‌మ్మం, పాలేరు మాత్ర‌మే జ‌న‌ర‌ల్. అందుకే నాయ‌కుల నుంచి పోటీ ఎక్కువ‌గా ఉంది. అగ్ర‌నేత‌ల‌కు అవే టార్గెట్‌గా మారాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గం కంటే రూర‌ల్ ఓటింగ్ ఉన్న పాలేరు సేఫ్ అనుకుని ప్ర‌చారానికి శ్రీ‌కారం చుడుతున్నారు.

Recommended For You

Comments are closed.