పాలేరులో తుమ్మల‌కు ప్ర‌త్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి..?

ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి.. ఇదే ఇప్పుడు జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. జిల్లా టిఆర్ఎస్ పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివ‌వాస‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజ‌య్‌, జ‌ల‌గం వెంక‌ట్రావు ఈ న‌లుగురిలో ఎవ‌రి దారి వారిదే. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఇప్ప‌టికీ వీరి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. చివ‌రి వ‌ర‌కూ ఎమ్మెల్యే సీటు కోసం ప్ర‌య‌త్నించి విఫ‌లం అయిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ట‌. అంతేకాదు.. ఆయ‌న సూచించిన వ్య‌క్తుల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు అధినేత కేసీఆర్‌ ఆదేశాల‌తో ఎమ్మెల్యేలను గెలిపించినా.. త‌ర్వాత ఎంపీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు పువ్వాడ, తుమ్మ‌ల‌, మ‌ద‌న్ లాల్‌, జ‌ల‌గం వంటి వాళ్లు స‌హ‌క‌రిస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఒక్క మ‌ధిర సీటు మిన‌హా ఎక్క‌డా పొంగులేటి మాట నెగ్గ‌లేదు. త‌న‌ను ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో వాడుకుని వ‌దిలేస్తార‌న్న అనుమానం ఆయ‌న‌లో ఉంది. ఎంపీగా గెలిచే అవ‌కాశాల‌కు సొంత పార్టీ నుంచే స‌హ‌కారంపై స‌వాల‌క్ష సందేహాల నేప‌థ్యంలో ఆయ‌న మ‌న‌సు హ‌స్తం వైపు లాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కొంద‌రు కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ఆయ‌న ట‌చ్ లో ఉన్నార‌న్న ప్ర‌చారమూ జ‌రుగుతోంది. ఆయ‌న‌కు పాలేరు టికెట్ ఇవ్వ‌డానికి హ‌స్తం పెద్ద‌లు కూడా సై అన్న‌ట్టు తెలుస్తోంది. పాలేరులో తుమ్మల నాగేశ్వ‌ర‌రావుపై పోటీచేయాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.
Full details: Warch video

పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌స్తుంద‌ని హ‌స్తం పెద్ద‌లు భావిస్తున్నారట‌. ఇక పొంగులేటి కూడా సెంటిమెంట్ క‌లిసివ‌స్తుంద‌ని న‌మ్ముతున్నారు. సుజాత‌న‌గ‌ర్ లో పోటీచేసినంత కాలం దివంగ‌త నేత రాంరెడ్డికి క‌లిసిరాలేదు.. పాలేరుకు మారిన త‌ర్వాత ఆయ‌న మంత్రి అయ్యారు… ఇప్పుడు తుమ్మ‌ల కూడా మంత్రి అయ్యారు… అంత‌కుముందు సంభాని చంద్ర‌శేఖ‌ర్ కూడా మంత్రిగా ఇక్క‌డి నుంచే చేశారు. సో పాలేరులో గెలిస్తే మంత్రి అవ‌కాశాలు ఎక్కువన్న సెంటిమెంట్ నేప‌థ్యంలో. పొంగులేటి కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. పైగా తుమ్మ‌ల‌ను ఓడిస్తే.. వ‌చ్చే మైలేజి వేరు… భ‌విష్య‌త్తులో రాజ‌కీయంగా జిల్లాలో బ‌ల‌మైన నేత‌గా ఎద‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అనుచ‌రులు కూడా అంటున్నార‌ట‌. మొత్తానికి పొంగులేటిపై జిల్లాలో ప్ర‌చారం అయితే జోరుగా సాగుతోంది.. మ‌రి ఆయ‌న మ‌న‌సులో ఏముందో చూడాలి.
Also Watch:

Watch Also:

Recommended For You