జూనియర్ స‌త్తాలో స‌గ‌మే జ‌న‌తా గ్యారేజా?

100 crores crossed
100 crores crossed

జూనియ‌ర్ ఎన్టీఆర్ దూకుడుకు ఇక ప‌గ్గాలుండ‌వా?  స‌త్తా చాటగలనన్న ధీమా నందమూరి యువకెరటంలో మెండుగా వ‌చ్చిందా? అవునంటున్నాయి  తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. వాస్త‌వానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఇంత‌వ‌ర‌కు వంద కోట్ల మార్కును అందుకోలేదు. దీంతో కాస్త ఆయనకే కాదు.. అభిమానుల్లో కూడా నిరాశే ఉండిపోయింది. నాన్న‌కు ప్రేమ‌తో విదేశాల్లో త‌న మార్కు చూపించిన ఎన్టీఆర్ బిలియ‌న్ క్ల‌బ్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు అది కూడా తీరిపోతోంది. జ‌న‌తా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ క‌ల‌ను తీరుస్తుంది. బిల‌య‌ర్ క్ల‌బ్‌లో ప‌డేస్తోంది. వాస్త‌వానికి ఇది ఎన్టీఆర్ అస‌లు స‌త్తాకు తార్కాణం కాదంటున్నారు అభిమానులు. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ మొద‌టి రోజు నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటీవ్ ప్ర‌చారం కూడా చేశారు. అయినా బాక్సాఫీస్  దగ్గర కలెక్ష‌న్లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. మహేష్ బాబు   బ్ర‌హ్మోత్స‌వం కానీ, పవన్ కళ్యాణ్  స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ కానీ డివైడ్ టాక్‌తో వంద కోట్లకు చేరువ కాలేకపోయాయి. మధ్యలోనే ఆగిపోయాయి. వీటికి భిన్నంగా జ‌న‌తా గ్యారేజ్ దూసుక‌పోతోంది. దీనిని  బ‌ట్టి జూనియ‌ర్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితే మినిమం రెండు వంద‌ల కోట్లు గ్యారెంటీ అంటున్నారు. డివైడ్ టాక్ మూవీనే ఇంత వ‌సూలు చేస్తుంటే.. సిస‌లైన హిట్ ప‌డితే మిగతా హీరోల‌కు అంద‌నంత ఎత్తులో ఉంటాడ‌న్న‌ది అభిమానుల వాద‌న‌. అలా  ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ఇవ్వకపోయినా.. తన సత్తాను చాటుకోవడానికి జనతా గ్యారేజ్ ఉపయోగపడింది.
వాస్తవానికి  ఇందులో లాజిక్ కూడా క‌నిపిస్తోంది. అవును జూనియ‌ర్ ఎన్టీఆర్ టైం కోసం చూస్తున్నాడు.. స‌రైన స‌మ‌యంలో స‌రైన ఆట ప‌డితే క‌లెక్ష‌న్లు అదుర్సే. అంతే కాదు.. తెలుగు సినిమా ఇండ‌స్ల్రీ రికార్డులు మాయం అవుతాయని జనతా గ్యారేజ్ ఫలితం చెబుతోంది. డివైడ్ టాక్ వంద కోట్లకు పైగా రాబడితే.. బ్లాక్ బస్టర్ కనీసం 2వందల కోట్లు కొల్లగొట్టడం ఖాయం.

గతంలో ఎన్టీఆర్‌కు వంద కోట్ల క్ల‌బ్ క‌ష్ట‌మ‌ని.. అందుకోలేడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొంద‌రు ప్ర‌చారం కూడా చేశారు. కానీ డివైడ్ టాక్‌తోనే త‌న స‌త్తా ఎంటో నిరూపించుకున్న ఎన్టీఆర్‌.. ఇప్పుడు రెండు వంద‌ల కోట్ల సినిమాపై క‌న్నేశాడు.. వ‌క్కంతం వంశీతో సినిమా ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టి.. స్టార్ డైరెక్ట‌ర్‌తోనే రంగంలో దిగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మ‌రి ఏ కాంబినేష‌న్తో వచ్చి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Recommended For You

Comments are closed.