జూనియ‌ర్ ఎన్టీఆర్ అలా మారాడా..?

సీనియర్ గా మారిన జూనియర్
సీనియర్ గా మారిన జూనియర్

NTR.. చిన్న వ‌య‌సులో స్టార్‌డ‌మ్ వ‌చ్చింది.. వంద‌ల సినిమాలు తీసిన అగ్ర‌హీరోల‌కు ధీటుగా హిట్లు ఇచ్చాడు. క‌లెక్ష‌న్లు సాధించాడు. కానీ రోజులు అన్నీ ఒక‌లా ఉండ‌వు కదా… ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి. స్థాయికి ద‌గ్గ హిట్ ప‌డ‌లేదు. సినిమాలు వ‌స్తున్నాయి.. పోతున్నాయి కానీ త‌న రేంజిని ఇంకా పూర్తిస్థాయిలో చూపించ‌లేకపోయాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో మరెవరికీ లేనంత అపార తెలివితేట‌లు, న‌టుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు అన్నీ ఉన్న హీరో జూనియ‌న్ ఎన్టీఆర్ సందేహం లేదు. అయినా ఆశించిన విజ‌యాలు, చేరుకోవాల్సిన గ‌మ్యాలు దూరంగానే ఉన్నాయి. దీంతో తరచుగా నిరుత్సాహ‌ప‌డేవాడు.  


కానీ ఇప్పుడు నవ్యోత్సాహంతో కనిపిస్తున్నాడు. హిట్, ఫ్లాపులకు అతీతంగా తనదైన వ్యక్తిత్వంతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మ‌నిషిగా చాలా మారాడు. తన జీవితంలో చోటుచేసుకున్న ప‌రిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. త‌న‌కు తెలియ‌కుండానే త‌న జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగిందో అర్ధం చేసుకుంటున్నాడు. తెలిసీ తెలియ‌ని వ‌య‌సు.. క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌నుకున్న‌వారు.. సరైన  స‌ల‌హాలు ఇచ్చే పెద్ద‌లు లేక‌పోవ‌డం ఇవన్నీ కార‌ణం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌లో ప‌రిణితి క‌నిపిస్తోంది. దూకుడుగా పోవ‌డం కంటే ల‌క్ష్యంగా దిశ‌గా అడుగులు వేయ‌డం మేలన్న సంకేతాలు ఆయ‌న మాట‌లో ప్ర‌తిధ్వ‌నిస్తుంది. నిండు కుండ‌లా తొణ‌కుండా క‌నిపిస్తున్నాడు. అభిమానులు కోరుకుంటున్న బ్లాక్ బస్టర్స్ ఇస్తానన్న భరోసాగా ఉన్నాడు.

న‌మ్మిన వారి కంటే కూడా త‌న‌తో న‌టించిన పెద్ద‌ల‌తో ప‌రిచ‌యం జూనియ‌ర్‌లో ఈ మార్పుకు కార‌ణ‌మంటున్నారు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ద్వారా జ‌గ‌ప‌తిబాబుకు వ్య‌క్తిగ‌తంగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇప్పుడు మోహ‌న్‌లాల్ వంటి స్టార్‌తో న‌టించి మ‌న‌సు చూర‌గొన్నాడు. ఇండ‌స్ట్రీ గురించి… అక్క‌డ మ‌నుషుల గురించి తెలుసుకునేలా ఈ పరిచయాలు ఉపయోగపడ్డాయి. జ‌గ‌ప‌తిబాబు ఎలా న‌ష్ట‌పోయాడో.. ఆయ‌న కెరీర్ ఎలా ఇబ్బందుల్లో ప‌డిందో ఎన్టీఆర్ అర్ధం చేసుకున్నాడు. తాను ఏం చేయ‌కూడ‌దో ఆయన్నుంచి నేర్చుకున్నాడు. ఇక స్టార్ ఇమేజ్‌ను ఎలా కాపాడుకోవాలో మోహ‌న్‌లాల్‌ను చూసి తెలుసుకున్నాడు. అంత పెద్ద స్టార్ అయినా ఇమేజ్ క్రేజ్‌లో ప‌డ‌కుండా కెరీర్‌ను ఎంత స‌క్స‌స్‌గా రాణిస్తున్నాడో అర్ధం చేసుకున్నాడు. ఇలా సీనియ‌ర్ల‌తో ఎన్టీఆర్ ప‌రిచ‌యం ఆయ‌న పంథానే మార్చిందట‌. మాట‌తీరును మార్చిందట‌. గ‌తంలో సినిమాల‌పై ఎమోష‌న‌ల్‌గా మాట్లాడే జూనియ‌ర్ ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ సినిమా ఆడియో వేదిక‌పై ఆశావాదిగా క‌నిపించాడు. ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా భ‌విష్య‌త్తుపై విశ్వాసం ప్రదర్శించాడు. ఎన్టీఆర్‌కు అస‌లు వ‌య‌సు ఇప్పుడే మొద‌లైంది. కాబ‌ట్టి తెలుగులో ఇదే ప‌రిణితితో నిర్ణ‌యాలు తీసుకుంటే నెంబ‌ర్ వ‌న్ గా ఎదిగే అవ‌కాశం ఉన్న హీరో. మ‌రి సాకారం చేసుకుంటాడా?

Recommended For You

Comments are closed.