త‌న సినిమా త‌న‌కే న‌చ్చ‌లేద‌న్న జ‌క్క‌న్న‌

rajamouli and tarak great moments in olden days

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి ఓ సంచ‌ల‌న కామెంట్ చేశాడు. తాను తీసిని తొలి సినిమా త‌న‌కు న‌చ్చ‌లేద‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాలో కొన్ని సీన్లు అస‌లు భాగా లేవ‌ట‌. అందులో ఎన్టీఆర్ సూప‌ర్‌గా యాక్ట్ చేశాడ‌ట‌. కీర‌వాణి సంగీతం అదుర్స్ అట‌. క‌థ‌ రాసిన పృధ్వీతేజ. ఇలా వారికే ఈ క్రెడిట్ ద‌క్కుతుంద‌ట‌.. తానే ఈ సినిమాను ఇంకా భాగా తీసి ఉండాల్సింది అంటున్నాడు జ‌క్క‌న్న‌. తాను మెగాఫోన్ ప‌ట్టి 15 ఏళ్లు అయిన సంద‌ర్భంగా సినిమాకు చెందిన ముచ్చ‌ట్లు సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమా త‌మ‌లాంటి కొత్త వాళ్ల‌కు మంచి అనుభ‌వం అని.. నిజంగా అభిమానులు ఆద‌రించిన తీరు అధ్బుత‌మ‌ని అన్నారు. విజ‌య‌యాత్ర‌కు వెళితే బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని అన్నారు.  షూటింగ్ కోసం స్విట్జ‌ర్లాండ్ వెళ్లిన‌ప్పుడు తార‌క్ తానూ ఒకే గ‌దిలో ఉండేవాళ్ల‌మ‌ని.. టీవీ, నిద్ర విష‌యంలో టామ్ అండ్ జెర్రిలా ఉండేవాళ్ల‌మ‌ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ద‌శాబ్ధ‌మున్న‌ర‌లో రాజ‌మౌళి, అటు ఎన్టీఆర్ ఎన్నో శిఖ‌రాలు ఎక్కారు. త‌మ విజ‌యాల‌ను షేర్ చేసుకుంటున్నారు.

Recommended For You

Comments are closed.