మైసూరు ద‌స‌రాకు కావేరీ సెగ‌ ?

మైసూరు.. చూడ‌క‌పోయినా ఈ నగరం గురించి తెలియ‌ని వారుండ‌రు. దేశంలో ఇంకా రాజ‌రికం ప‌ద్ద‌తులు అవ‌లంబిస్తున్న కుటుంబాలు, బృందావ‌న్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క పార్కులు, మహారాజా ప్యాలెస్ ఇలా ప‌ర్యాట‌క క్షేత్రాల‌కు కేరాఫ్‌. క‌ర్నాట‌క ప‌ర్యాట‌క శాఖకు క‌ల్ప‌వృక్షం. ఇక ద‌స‌రా వ‌చ్చిందంటే మైసూరులో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఉంటారు. అక్క‌డ జ‌రిగే వేడుకుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ విదేశాల నుంచి టూరిస్టులు లక్షల్లో తర‌లివ‌స్తుంటారు. ప్ర‌తి ఏటా ఘ‌నంగా జ‌రిగే ఈ వేడుకులు ఇప్పుడు వెల‌వెల‌బోతున్నాయి. దీనికి కార‌ణం కావేరీ వివాదం.

క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు మ‌ధ్య కావేరీ వివాదం న‌డుస్తోంది. నిత్యం బంద్‌లు, రాస్తారాకోలు జ‌రుగుతున్నాయి. దీంతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. దీనివల్ల ప‌ర్యాట‌కులు త‌గ్గిపోయారు. మైసూరు ముఖం చూసేవారు లేరు. హోట‌ల్స్ అన్నీ వెల‌వెల బోతున్నాయి. ఇటుగా వ‌స్తున్న టూరిస్టు బ‌స్‌లు, కార్లు త‌గ్గిపోయాయి. దీంతో ద‌స‌రా వేడుకులు వెల‌వెల‌బోతున్నాయి. క‌ర్నాట‌క‌లో కావేరీ సెగ ఎక్కువ‌గా మైసూరుకే తాకింది. ప్ర‌తిష్టాత్మ‌క ద‌స‌రా వేడుకుల‌పై ప‌డింది. అయితే స్థానికులు మాత్రం ప‌ర్యాట‌కుల‌తో సంబంధం లేదు.. వ‌చ్చినా రాక‌పోయినా వేడుక‌లు ఘ‌నంగానే జ‌రుగుతాయ‌ని అంటున్నారు. మ‌రి మైసూరు మెరుపులు అంతే స్థాయిలో ఉంటాయా? చూడాలి.

Recommended For You

Comments are closed.