బాహుబ‌లిపై చ‌ర్చే లేద‌ట‌.. అంతా ఆ సినిమాపైనే.. !

బాహుబలిని చైనాలో లైట్ గా తీసుకుంటున్నారు జనం. దంగల్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సాక్షాత్తూ దేశ అధ్యక్షుడు కూడా దంగల్ లాంటి సినిమాలు మరిన్ని తీయాలని మోడీని కోరారట. బాహుబ‌లి అధ్బుతం.. మ‌హాధ్బుతం అంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ వ‌ల్ల సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది కానీ.. క‌థ ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు కొంద‌రు చేశారు. విదేశాల్లో బాహుబ‌లి సినిమా కంటే కూడా ఇప్పుడు దంగ‌ల్ మంచి  పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన ఈ సినిమా చైనాలో ఏకంగా వెయ్యి కోట్ల‌కు పైగా రాబ‌ట్టింది. అక్క‌డ ప్ర‌జ‌లు ఈ బ‌యోపిక్ కు  ఫిదా అయ్యార‌ట‌. ఎంత‌గా అంటే…ఆ దేశ అధ్య‌క్షుడు గ్జి జింగ్‌పింగ్ కూడా దంగ‌ల్ వంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు ప్ర‌ధాని మోడీతో అన్నార‌ని వార్త‌లొస్తున్నాయి. బాహుబ‌లి అంటే పెద్ద‌గా చైనా వాసులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణం.. అలాంటి భారీ యాక్ష‌న్ చిత్రాలు చైనావాళ్లు ఎప్పుడో తీశారు. వాళ్లేఇండియాలో రిలీజ్ చేసి ద‌శాబ్ధాల క్రిత‌మే కాసులు రాల్చుకున్నారు. ఇప్పుడు వాళ్లు మ‌న‌వీయ కోణంలో ఉండే డ్రామా సినిమాలు కోరుకుంటున్నార‌ట‌. అందుకే త్రీ ఇడియిట్స్‌, పీకే, దంగ‌ల్ వంటి సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.

Recommended For You

Comments are closed.