నిర్భ‌య్ ఫెయిల్ అయిందట‌….!

నిర్భ‌య్… భార‌త్ సొంతంగా త‌యారుచేసిన అణుబాంబుల‌ను మోసుకెళ్లే మిస్సైల్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. వెయ్యి కి.మీ. దూరాన్ని ఛేధించే ఈ క్షిపిణిని నాలుగోసారి ఒడిషాలోని బాలాసోర్ నుంచి ప్ర‌యోగించారు. కానీ గాల్లోనే పేలిపోయి బంగాళాఖాతంలో ప‌డింది. 2013 నుంచి దీనిని ప‌రీక్షిస్తున్నాడు. మొద‌టిసారి 2013 మార్చిలో ప‌రీక్షించ‌గా విఫ‌ల‌మైంది. మ‌ధ్య‌లోనే పేలిపోయింది. త‌ర్వాత రెండోసారి అక్టోబ‌ర్ 2014లో ప‌రీక్షించ‌గా పాక్షికంగా స‌క్స‌స్ అయింది. మూడోసారి 2015 అక్టోబ‌ర్‌లో ఫర్వాలేద‌నిపించింది. నాలుగోసారి నిరాశే మిగిల్చింది. దీంతో డిఆర్‌డిఓ మ‌రోసారి టెక్నాల‌జీ లోపాల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. ఏమైనా అప‌జ‌యాలు ఎర‌గ‌ని భార‌తీయ ర‌క్ష‌ణ ప‌రిశోధ‌నా సంస్థ‌కు నిర్బ‌య్ మాత్రం కొర‌క‌రాని కొయ్య‌గా మారింది.

Recommended For You

Comments are closed.