మైత్రివ‌నం రోడ్లు ఎలా బాగుప‌డ్డాయో తెలుసా?

హైద‌రాబాద్ మైత్రివ‌నం తెలియ‌ని వారుండ‌రు.. ఎన్ని కంపెనీలు ఉన్నాయో లెక్క‌కు అంద‌వు. కోచింగ్ సెంట‌ర్లు అయితే చుక్క‌ల‌ను త‌ల‌పిస్తాయి. అక్క‌డ‌కు వ‌చ్చే చిన్నా, పెద్దా, పిల్లా పీచూ తేడా లేకుండా బ్రోచ‌ర్లు పంచుతూ ఉంటారు. 5 నిమిషాలు న‌డిస్తే వంద‌ల్లో పాంప్లీట్స్ మీచేతికి అందుతాయి. అయితే అలా తీసుకున్న‌వి అంద‌రూ అక్క‌డే ప‌డేస్తారు. దీంతో రోడ్ల కంటే కూడా పాంప్లీట్స్ మీద ఎక్క‌వుగా న‌డుస్తుంటాం. ఇక్క‌డ కొచింగ్ సెంట‌ర్లు పంచే ప‌త్రిక‌ల‌తో రోడ్ల‌న్నీ నిండిపోతాయి. బ్రోచ‌ర్లు పేరుక‌పోయి రోడ్డు కూడా క‌నిపించ‌దు. ఇది అంద‌రీరీ అనుభ‌వంలోకి వ‌చ్చి ఉంటుంది. అయితే ఇటీవ‌ల కాలంలో ఈ రోడ్డు కూడా బాగుప‌డింది. అధికారులు కంపెనీపై కొర‌ఢా జులిపించారు. బ్రోచ‌ర్ చేతిలో పెడితే.. పెనాల్టీ నోటీసు చేతిలో పెడుతున్నారు. 1000-30000 ల వ‌ర‌కు ఫైన్ వేస్తున్నారు. దీంతో కంపెనీలు బ్రొచ‌ర్ సంస్కృతికి గుడ్‌బై చెప్పేశాయి.  దీంతో రోడ్డు ఇప్పుడు క‌ల‌ర్‌ఫుల్ బ్రోచ‌ర్‌ల‌తో కాకుండా… క్లీన్‌గా బ్లాక్ టాప్ తో మెరిసిపోతున్నాయి. అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే మార్పు వ‌చ్చింది.

Recommended For You

Comments are closed.