నారా లోకేష్‌ను హిప్న‌టైజ్ చేస్తే.. ఏమైనా చేస్తారా?

ఏపీ పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను హిప్న‌టైజ్ చేశార‌ట‌.. అందుకే ఆయ‌న అనాలోచితంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ ఎంపీ బుట్టా రేణుక‌, క‌ర్నూలు సిటీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాల‌ని స‌భ‌లో ప్ర‌క‌టించారు. అంటే ఆయ‌న టికెట్లు ఖ‌రారుచేసినట్టే. అంతేకాదు.. ఎమ్మ‌గ‌నూరులో కూడా జ‌య‌నాగేశ్వ‌ర‌ర‌రెడ్డిని మ‌ళ్లీ గెలిపించి అసెంబ్లీకి పంపాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. లోకేష్ ప్ర‌క‌ట‌న‌లు సీమ ముఖ‌ద్వారం అయిన క‌ర్నూలు జిల్లాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. అభ్యర్ధులు ఖుషీ అవుతుంటే.. ఆశావ‌హులు ర‌గిలిపోతున్నారు. క‌ర్నూలు అసెంబ్లీ సీటుపై టీజీ వెంక‌టేశ్ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. ఆయ‌న వార‌సుడు భ‌ర‌త్ చాలాకాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. సామాజిక సేవా కార్యక్ర‌మాల పేరుతో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. గ‌తంలో స‌ర్వే కూడా త‌న‌కు అనుకూలంగా వ‌చ్చింద‌ని.. టికెట్ త‌న‌కేనంటూ సోష‌ల్ మీడియాలో కూడా భ‌ర‌త్ లీకులు ఇచ్చారు. కానీ అనూహ్యంగా లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డికే ఓటంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఇది టీజీ కుటుంబంలో అల‌జ‌డి రేపింది. దీంతో ఆగ్ర‌హంగా ఉన్న టీజీ లోకేష్ పై స‌టైర్లు వేశారు. లోకేష్ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌ని.. ఆయ‌న టికెట్ ప్ర‌క‌టించ‌డం వెన‌క ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఏదో చేశార‌ని అంటున్నారు. లోకేష్ ను మోహ‌న్ రెడ్డి హిప్న‌టైజ్ చేశార‌ని.. అందుకే అలా ప్ర‌క‌టించి ఉంటార‌ని మీడియాముందే అన్నారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ చివ‌రి రోజు మాత్ర‌మే ప్ర‌క‌టిస్తార‌ని.. అర్ధ‌రాత్రి చంద్ర‌బాబు నివాసంలో తేలే అంశాన్ని లోకేష్ ఇలా ఏడాది ముందు చెప్ప‌డానికి మోహ‌న్ రెడ్డి హిప్న‌టైజ్ కార‌ణ‌మంటున్నారు టీజీ వెంక‌టేశ్‌. పార్టీ అధ్య‌క్షుడు మాటే ఫైన‌ల్ అంటున్నారు. ఇది అస‌లు క‌థ‌.. అయితే ఎస్వీ మోహ‌న్ రెడ్డి మ‌నుషులు కూడా టీజీపై స‌టైర్లు వేస్తున్నారు. పార్టీలు మారి వ‌చ్చిన నీవు కూడా రాజ్య‌స‌భ కోసం లోకేష్ ను హిప్న‌టైజ్ చేశావా అంటున్నారు.. మ‌రి దీనికి ఆయ‌న స‌మాధానం ఏంటో?

Recommended For You