నంద్యాల‌లో మోహ‌రిస్తున్న ద‌ళాధిప‌తులు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క‌ద‌న‌రంగంలో దిగుతున్నాయి. లోకేష్ స‌హా మంత్రులంతా క్యూ క‌డుతున్నారు. వైసీపీ  న‌త బ‌ల‌గాన్ని మోహ‌రిస్తోంది. ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. త‌న ఎమ్మెల్యేను మొత్తం అక్క‌డే ఉండేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన నాయ‌కుల‌తో పాటు.. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  ఏపీ సి.ఎం చంద్రబాబు 12 మంది ఎమ్మెల్యేలకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పండి. ఏం కావాలో వారికి ఇవ్వండి. అప్పుడు ప్రజలు తమ వైపు దృష్టి పెడతారని చెప్పారట. మంత్రులు నారాయణ, ఆదినారాయణరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ, కేఈ కృష్ణమూర్తితో పాటు..గంటా శ్రీనివాసరావులు రంగంలోకి దిగారు. ఇంకోవైపు మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, ఎన్.ఎండి ఫరూక్ లు ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ఎస్పీవైరెడ్డిలు ఎలాగూ అందుబాటులో ఉండనే ఉన్నారు. సి.ఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే పర్యటించి వెళ్లగా యువనేత, మంత్రిలోకేష్ నంద్యాలలో పర్యటించి క్యాడర్ లో ఉత్సాహం నింపారు. ఫలితంగా నంద్యాల ఉప ఎన్నిక ఎన్నడూలేనంత ఉత్కంఠను పెంచింది. మ‌రి విజయం ఎవ‌రికి వ‌రిస్తుందో… భూమా కుటుంబ ఆధిప‌త్యానికి.. శిల్పా ప‌ట్టుద‌ల‌కు మ‌ధ్య పోటీగా మారింది.

WATCH THIS:-నంద్యాలలో లోకేష్ టూర్

Recommended For You

Comments are closed.