నిజాంపేటలో తలెత్తుకునేలా చేసిన నటసింహం..!

హైదరాబాద్ లోని నిజాంపేట జంక్షన్ లో బాలయ్య కటౌట్ అదిరిపోయింది.. వంద అడుగుల కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది.  ఎన్టీయార్ బయోపిక్ చిత్రం విడుదల సందర్భంగా  ప్రమోషన్ లో భాగంగా అభిమానులు దీనిని  ఏర్పాటు చేశారు. ఎన్టీయార్ మేకప్ లో అదిరిపోయారు.. నిజంగా ఎన్టీఆర్ లాగే బాలయ్య ఉన్నారంటూ అభిమానులు అంటున్నారు. దీనిని చూసిన వారు ముందుగా   ఎన్టీయార్ అంటున్నారు.. తర్వాత జాగ్రత్తగా గమనిస్తే తప్ప బాలయ్య ముఖం కనిపించడం లేదు.. మొత్తానికి నిజాంపేట జంక్షన్ లో వచ్చిపోయే వారికే కాదు.. మెట్రో ట్రైన్ లో ప్రయాణించేవారికి కూడా కొట్టచ్చినట్టు కనిపిస్తోంది.

Recommended For You