స‌మంతపై నాగ్ ఫ్యామిలీ కోపానికి కార‌ణ‌మిదేనా..!

స‌మంత తీరుపై ఇటీవ‌ల నాగార్జున కుటుంబం అసంతృప్తిగా ఉంద‌ట‌.. దీనికి కార‌ణం ఆమె వ్య‌వ‌హారశైలి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. పెళ్లి ఖ‌రారు కావ‌డానికి ముందు కంటే ఇప్పుడే.. ఎక్కువ‌గా హాట్ ఫోటోల‌కు ఫోజులు ఇస్తూ సోష‌ల్ మీడియాలో పెడుతున్నార‌ట‌. ఇటీవ‌ల బీచ్‌లో బికినీ డ్ర‌స్‌లో దిగిన ఫోటోతో పాటు.. అంత‌కుముందు రెండు మూడు షూట్‌ల‌లో దుస్తులు మ‌రీ పొదుపుగా వేసుకున్నార‌ట. దీనిపై నాగ్ కుటుంబంలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వివాహం నిశ్చ‌య‌మైన నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్లో స‌మంత కేర్ తీసుకుంటే బాగుంటుంద‌న్న స‌ల‌హా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కినేని.. అటు ద‌గ్గుబాటి కుటుంబాల‌కు మ‌న‌వ‌డు అయిన చైతుకు భార్య‌గా వెళుతున్న నేప‌థ్యంలో స‌మంత హ‌ద్దుల్లో ఉంటే మంచిద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. అయితే ఇదంతా పుకార్లేన‌ని.. ఇందులో నిజం లేద‌ని నాగ్ కుటుంబ స‌న్నిహితులు చెబుతున్నారు. స‌మంత విష‌యంలో నాగ్ ఫ్యామిలీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు చెబుతున్నారు. చైతు కూడా స‌మంత వ్య‌క్తిగ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. సినిమాల్లో న‌టించ‌డానికి కూడా ఫుల్ రైట్స్ ఇచ్చార‌ట‌.

Recommended For You

Comments are closed.